బీఎస్పీ నేతపై దుండగులు కాల్పులు, అల్లుడూ కూడా హతం
లక్నో : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ వైరం బుసలుకొడుతుంది. ఇటీవల అమేథీలో స్మృతి ఇరానీ సన్నిహితుడు సురేంద్ర సింగ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా యూపీలో మరో బీఎస్పీ నేత, అతని అల్లుడిని దుండగులు మట్టుబెట్టడం కలకలం రేపుతుంది.

కాల్పుల కలకలం
బీఎస్పీ నేత హజీ ఆసన్, అతని అల్లుడు షాబాద్ దారుణ హత్యకు గురయ్యారు. వారిద్దరూ బిజ్నూరులోని నజీబాబాద్ వస్తోండగా గుర్తుతెలియని దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ బంధువుల ఇంటికి వెళ్లివస్తుండగా కాల్పులకు తెగబడ్డారు దుండగులు. కాల్పులు జరిపిన దుండగులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆసన్‌ను ఎవరు మట్టుబెట్టారో ఇంకా తెలియరాలేదని .. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications