702 కి.మీ మెట్రో డన్: సెకండ్ ఫేజ్ 1016 కి.మీ, తెలుగు రాష్ట్రాలకు నిర్మలా మొండిచేయి
ప్రయాణికులను వేగంగా గమ్యస్థానం చేర్చే మెట్రో ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధులను భారీగానే కేటాయించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో వివిధ నగరాల్లో ఇప్పటికే 702 కిలోమీటర్ల మెట్రో లైన్ పూర్తయిందని.. సేవలు కూడా అందిస్తున్నామని ఆమె తెలిపారు. మరో 1016 కిలోమీటర్ల ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని వివరించారు. వాటికి సింహాభాగం నిధులను కేటాయించారు.
బడ్జెట్ మెట్రో రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేకుండా పోయింది. హైదరాబాద్ మెట్రో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి ఎక్కడా పేర్కొనలేదు. కేరళ, బెంగుళూర్, చెన్నై, నాగ్‌పూర్ మెట్రోల అభివృద్ధికి మాత్రం రెండో దశలో కేటాయింపులు చేశారు. చెన్నై మెట్రో రైలుకు రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయింపులు ఇచ్చారు. నాసిక్‌లో కొత్త కారిడార్ ఏర్పాటుకు కేటాయింపులు జరిగాయి. తెలుగు రాష్ట్రాల మెట్రో గురించి మాత్రం ఆర్థికమంత్రి నిర్మల ఎక్కడా ప్రస్తావించలేదు.

నిర్మలా సీతారామన్ చెప్పినట్టే ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14వ తేన తమిళనాడు వెళుతున్నారు. చెన్నైలో మెట్రోరైలు రెండోదశ విస్తరణ పనులకు, కావేరి-గుండారు అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తారు. సీఎం పళనిస్వామి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి.. ఆహ్వానించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని మోదీ చెన్నైలో రెండు పథకాలకు శంకుస్థాపన చేసి.. బహిరంగ సభలో ప్రసంగించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications