Budget 2021: పాత కార్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, గుజరీకి గుడ్ న్యూస్, కార్లు ఎవరికి ఊరికేరావు!
హైదరాబాద్/ న్యూఢిల్లీ/ బెంగళూరు: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పలు రంగాలకు గుడ్ న్యూస్ చెప్పారు. నిర్మలమ్మ హామీలతో స్టాక్ మార్మెట్లు దసుకుపోతున్నాయి. ఇదే సమయంలో గుజరీ వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఇంతకాలం రయ్ రయ్ అంటూ దుసుకుపోయిన పాత కార్లు, గూడ్స్ వాహనాలు, డబ్బా బస్సులు, ట్రక్లులు ఇక తుక్కు కిందకు చేరిపోతున్నాయి. చెట్టుకింద ప్లీడర్ సినిమాలో తనికెళ్ల భరణి రాజేంద్ర ప్రసాద్ కారు చూసిన ప్రతిసారి పాతసామాన్లు కొంటాం పాతసామన్లు కొంటాం అని డైలాగ్ చెప్పారు. ఇప్పుడు గుజరీ వ్యాపారులు పాత కార్లు, బైక్ లు కొంటాం అంటూ ఇంటిఇంటికి తిరగడానికి సిద్దం అయిపోతున్నారు. కార్లు ఎవరికీ ఊరికేరావు అంటూ కొందరు విచారంగా అంటున్నారు.

తిప్పలు పడుతున్న ప్రభుత్వాలు
భారతదేశంలో పాత వాహనాల కారణంగా వాయుకాలుష్యం (పొల్యూషన్) కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ కట్టడి చెయ్యడానికి అక్కడి ప్రభుత్వంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు నానా తిప్పలుపడుతున్నాయి. దేశంలో కాలం చెళ్లిపోయి రోడ్ల మీద సంచరిస్తు విపరీతమై పొల్యూషన్ కు కారణం అవుతున్న వాహనాల కథ చూడాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

పాత వాహనాలు తుక్కుతుక్కు
దేశంలో వాహన పొల్యూషన్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. దేశంలో పర్యావరణ వాహనాలకు పెద్దపీట వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కాలం చెల్లిన వాహనాలను తుక్కుతుక్కు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. పొల్యూషన్ కు కారణం అయిన వాహనాలు తుక్కుతుక్కు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కేంద్ర ప్రభుత్వం లెక్కలు
దేశంలో ఇంతకాలం సంచరించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు నిఘా వేస్తున్నారు. కమర్షియల్ వాహనాలు (ట్యాక్సీలు, గూడ్స్) వాహనాలు 15 ఏళ్లకు మంచి ఉంటే ఇకముందు తుక్కుతుక్కు కానున్నాయి. ఇక వ్యక్తిగతంగా ప్రజలు ఉపయోగిస్తున్న వాహనాలు 20 ఏళ్లు దాటి ఉంటే వాటిని తుక్కుతుక్కు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

పాత కార్లు కొంటాం... పాత సామన్లు కొంటాం
25ఏళ్ల క్రితం వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించి విడుదలైన చెట్టుకిందప్లీడర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో హీరోకు పాత డొక్కుకారు ఉంటుంది. ఆ కారు ఎక్కపడితే అక్కడ నిలిచిపోవడం. అదే సమయంలో నెత్తిన బుట్టపెట్టుకున్న తనికెళ్ల భరణి పాత సామాన్లు కొంటాం... పాత కార్లు కొంటాం అంటూ డైలాగులు చెప్పాడు.

గుజరీకి గుడ్ న్యూస్..... కార్లు ఎవరికి ఊరికేరావు
చెట్టుకిందప్లీడర్ సినిమాలో తనికెళ్ల భరణి డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు అదే డైలాగుతో గుజరీ వ్యాపారులు ఇంటింటికి తిరగడానికి సిద్దం అవుతున్నారు. గుజరీ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇంతకాలం వాహనాల్లో సంచరిస్తున్న వాహనాల్లో తిరుగుతున్న ప్రజలు ఇప్పుడు వాటిని అమ్ముకోలేక, వాటిలో తిరగలేక గుజరీకి వెయ్యడానికి సిద్దం అవుతున్నారు. కార్లు ఎవరికి ఊరికే రావు కదా అంటున్నారు మధ్య తరగతి ప్రజలు.












Click it and Unblock the Notifications