దేశ ప్రజల సగటు ఆదాయం ఏకంగా సగం పెరిగిందట
Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు.
Recommended Video

10 సంవత్సరాల కాలంలో దేశ ప్రజల సగటు ఆదాయం ఏకంగా 50 శాతం మేర పెరిగిందని నిర్మల సీతారామన్ అన్నారు. ఈ పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి విముక్తి కల్పించామని నిర్మల సీతారామన్ చెప్పారు. పేదల సంక్షేమమే దేశ సంక్షేమంగా అభివర్ణించారామె.

ప్రతి నెలా పెరుగుతూ వస్తోన్న వస్తు-సేవా పన్నుల వసూళ్లే సగటు ఆదాయం వృద్ధి చెందిందనడానికి నిదర్శనమని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అయిదో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందనే విషయాన్ని ఈ లెక్కలు స్పష్టం చేస్తోన్నాయని పేర్కొన్నారు.
వచ్చే అయిదు సంవత్సరాల కాలంలో దీన్ని మరింత పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి ఫలాలను చేర్చనున్నామని, దీనితోపాటు- దేశవ్యాప్తంగా అనేక గిరిజన గ్రామాలు, ఆదివాసీల ఆవాసాలకు మౌలిక సదుపాయాలను కల్పించామని, వాటన్నింటికీ 4జీ నెట్‌వర్క్‌ను కల్పించామని ఆమె అన్నారు.
ప్రజల సగటు ఆదాయాన్ని మరింత పెంచడానికి వచ్చే అయిదేళ్ల కాలంలో అనేక చర్యలను చేపట్టబోతోన్నామని నిర్మల సీతారామన్ వివరించారు. స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ అందించామని, దీనివల్ల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చగలిగామని నిర్మల సీతారామన్ చెప్పారు. అలాగే 54 లక్షలమంది యువత నైపుణ్యాన్ని మరింత పెంచగలిగామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications