Budget 2026: కేంద్ర బడ్జెట్ లో మోదీ మార్క్, టార్గెట్ ఫిక్స్..!!
కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ సారి బడ్జెట్ లో పాలనా పరంగా.. రాజకీయంగా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. త్వరలో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేసారు. అదే విధంగా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెంచారు. రూ.53.47 లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సారి దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ప్రధాని మోదీ మార్క్ తో రూపకల్పన చేసిన ఈ బడ్జెట్ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది.
నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ప్రకటించారు. మొత్తం బడ్జెట్ పరిమాణం - రూ.53.47 లక్షల కోట్లు కాగా, రెవెన్యూ లోటు - రూ.5,92,344 కోట్లు.. అదే విధంగా ద్రవ్య లోటు - రూ.16,95,768 కోట్లుగా తేల్చారు. ఇక, రంగాల వారీగా కేటాయింపులు చూస్తే.. రవాణా రంగం - రూ.5,98,520 కోట్లు, రక్షణ రంగం - రూ.5,94,585 కోట్లు, గ్రామీణాభివృద్ధి రంగం - రూ.2,73,108 కోట్లు, హోంశాఖ కార్య కలా పాలు - రూ.2,55,234 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలు - రూ.1,62,671 కోట్లు, విద్య రంగం - రూ.1,39,289 కోట్లు, ఇంధన రంగం - రూ.1,09,029 కోట్లు, వైద్య, ఆరోగ్యం - రూ.1,04,599 కోట్లు, పట్టణాభివృద్ధి - రూ.85,522 కోట్లు, ఐటీ, టెలికాం - రూ.74,560 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలు - రూ.70,296 కోట్లు, సాంఘిక సంక్షేమం - రూ.62,362 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగాలకు - రూ.55,756 కోట్లు కేటాయించారు.

శాఖల వారీగా కేటాయింపులు
అదే విధంగా పన్ను నిర్వహణ - రూ.45,500 కోట్లు, ఆర్థిక నిర్వహణ - రూ.20,649 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి - రూ.6,812 కోట్లు ప్రతిపాదించారు. ఆరు కీలక రంగాల్లో సంస్కరణ లు తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తామన్నారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశ సెమీ కండక్టర్ రంగం వృద్ధి కోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభిస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్... ఇందుకోసం రూ.40వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు కోసం ప్రత్యేక మైనింగ్ మిషన్ చేపడతామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల మీదుగా ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ప్రకటించారు. కొత్తగా డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేస్తాని నిర్మలా సీతారామన్ చెప్పారు. న్యూ ఇన్ కం టాక్స్ యాక్ట్ -2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications