Budget 2026: ఎన్నికల వేళ ఆదాయపు పన్ను లో భారీ మినహాయింపు..!?
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ పద్దులు సిద్ధమయ్యాయి. మరి కొద్ది సేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్‌లో 2026-27 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పిస్తారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ సారి బడ్జెట్ లో సామాన్యులను ఆకట్టుకునే వరాలు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 2025 వార్షిక బడ్జెట్ లో రూ.12లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు మరో సారి మినహాయింపు పెంపు పైన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఈ సారి సామాన్యులకు మేలు చేసే నిర్ణయాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్దిక సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న 'ఆదాయపు పన్ను చట్టం 2025'పై ఈ బడ్జెట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది పన్నుల వ్యవస్థను మరింత సరళ తరం చేయడమే కాకుండా, పాత చట్టాల్లోని సంక్లిష్టతలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చారు.

గత ఏడాది పెంచిన స్టాండర్డ్ డిడక్షన్‌ను ఈసారి మరింత పెంచుతారని వేతన జీవులు ఆశతో ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత, కొత్త పన్ను విధానాల మధ్య ఎంపికపై పన్ను చెల్లింపు దారుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసే దిశగా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. కాగా, పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత డిజిటలైజ్ చేయడం తో పాటుగా 'ట్యాక్స్ ఇయర్' ఒకే విధానాన్ని తీసుకురావడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
మారుతున్న స్లాబుల విధానం
కాగా, గత ఏడాది ప్రకటించిన కొత్త పన్ను విధానం ప్రకారం.. రూ. 0 - 4 లక్షలు: సున్నా (0%), రూ. 4 - 8 లక్షలు: 5%, రూ. 8 - 12 లక్షలు: 10%, రూ. 12 - 16 లక్షలు: 15%, రూ. 16 - 20 లక్షలు: 20%, రూ. 20 - 24 లక్షలు: 25%, రూ. 24 లక్షల పైన: 30% గా ఏంది. ఇక.. ఈ ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. గత బడ్జెట్ లో వార్షిక ఆదాయం రూ.12లక్షల లోపు ఉన్నవారికి రిబేటు ద్వారా పన్ను లేకుండా ఊరట కల్పించారు. మరి ఈసారి బడ్జెట్‌లో నిర్మలమ్మ పన్ను చెల్లింపుదారులకు ఇంకా ఏవైనా అదనపు ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు బడ్జెట్ లో నిర్మలమ్మ చేసే ప్రకటన కోసం అందరూ ఆసక్తితో ఉన్నారు.












Click it and Unblock the Notifications