నామినేషన్ వేసేందుకు దున్నపోతుపై వచ్చాడు!

పాట్నా: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు ఎన్నో వేషాలు వేస్తుంటారు. తాజాగా బీహార్ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా దున్నపోతుపై ఎక్కి వచ్చాడు.

బిహార్‌లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మనోజ్‌ యాదవ్‌ నామినేషన్‌ వేయడానికి కలెక్టరేట్‌కి ఏకంగా దున్నపోతుపై ఊరేగుతూ వచ్చారు.

 Buffalo goes out of control, creates ruckus as candidate reaches nomination centre on it

అయితే, సరిగ్గా అక్కడికి వచ్చాక ఆ దున్నపోతు అక్కడ ఉన్న జనాన్ని చూసి బెదిరిపోయింది. కొంత గందరగోళం కూడా సృష్టించింది. దీంతో మనోజ్‌యాదవ్‌ దాని మీద నుంచి ఎలాగోలా కిందపడకుండా జాగ్రత్తగా దిగారు.

తమ నేతకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అతని అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత తన నామినేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు మనోజ్ యాదవ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+