జాలర్ల హత్యపై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురండి, ప్రధాని మోడీకి పినరయి విజయన్ లేఖ
సముద్రతీర చట్టాలను ఉల్లంఘించి సముద్రతీరంలో జాలర్లను మట్టుబెట్టిన ఘటనలో అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. 2012 ఫిబ్రవరిలో ఇటలీ మెరైన్ సిబ్బంది కాల్పులు జరిపడంతో ఇద్దరు జాలర్లు చనిపోయారు. అయితే ఆ ఘటనలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ మెరైన్ చట్టానికి అనుగుణంగా ఇటలీలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Recommended Video
ఇద్దరు భారతీయులను కాల్చిచంపిన ఘటనలో న్యాయం జరగడం లేదని విజయన్ అన్నారు. దీంతో ఆ కుటుంబాలకు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని ప్రధాని మోడీకి తెలియజేశామని తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ న్యాయం చేయని పక్షంలో న్యాయ విచారణ కోసం అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడిని తీసుకురావాలని విజయన్ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications