జేసీబీలతో ప్రచారం - కలిసొచ్చేనా, మారుతున్న సీన్..!!

హర్యానాలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచారం చివరి దశకు చేరింది. ప్రధాన పార్టీలు హోరా హోరీగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి. ప్రచారంలో భాగంగా కొత్తగా బుల్‌డోజర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం దక్కాలంటే బుల్‌డోజర్ల ప్రచారం పైనే పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి.

హర్యానా ఎన్నికల్లో కొత్త ప్రచార వాహనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కార్లు, వ్యాన్ లు కనిపించే ప్రచారంలో కొత్తగా జేసీబీలు దర్శనమిస్తున్నాయి. వచ్చే నెల 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు చివరి దశ ప్రచారం ప్రారంభించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్తగా బుల్‌డోజర్లతో అభ్యర్ధులు తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. వీటినే తమ ప్రచార రధాలుగా మార్చుకొని ప్రతీ నియోజకవర్గంలో హోరెత్తిస్తున్నారు. ఈ కొత్త తరహా ప్రచారం హర్యానాలో ఆసక్తి కరంగా మారుతోంది.

Bulldozer becomes a symbol of state power and politics in Haryana

జేసీబీల నుంచే అభ్యర్ధులు ఓటర్లకు తమ అభ్యర్ధనలు చేస్తున్నారు. దీంతో, జేసీబీలు ఉన్నవారికి ప్రచారం కలిసి వస్తున్నది. గతంలో తమ జేసీబీలకు పనులు లేక నీరసపడిన వారికి ఇప్పుడు వేలాది రూపాయాలు అద్దె రూపంలో వస్తున్నాయి. రాష్ట్రంలోని గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, నూహ్‌, మహేంద్రబాగ్‌ తదితర ప్రాంతాల్లోని రియాల్టీ సెక్టార్‌లో ఈ తరహా ప్రచారం కొనసాగుతోంది. ఇక్కడ జేసీబీకు గంటకు రూ 5 వేల వరకు పార్టీల అబ్యర్దులు చెల్లిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో యోగి ప్రభుత్వం బుల్‌డోజర్ల సంస్కృతి తీసుకొచ్చింది. యూపీలో బుల్‌డోజర్ల నినాదానికి మద్దతు లభించింది. ఇప్పుడు క్రమేణా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. పార్టీలు తమ విజన్ ఆవిష్కరణలో భాగంగా బుల్‌డోజర్ల ద్వారా చేస్తున్న ప్రసంగాలకు ఓటర్లలోనూ ఆసక్తి కనిపిస్తోంది. దీంతో..జేసీబీల నుంచే ప్రచారానికి అభ్యర్ధులు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+