వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్కినా ఫాసో: 132 మందిని కాల్చి చంపిన సాయుధులు, మృతుల్లో ఏడుగురు చిన్నారులు - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బుర్కినా ఫాసో

ఆఫ్రికాలోని ఉత్తర బుర్కినా ఫాసోలో యాఘా ప్రాంతంలోని ఒక గ్రామంపై దాడి చేసిన సాయుధులు 132 మందికి పైగా కాల్చి చంపారని ఆ దేశ అధికారులు చెప్పారు.

మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

దాడి చేసిన సాయుధులు దాదాపు వంద మందిని హతమార్చారని అంతకు ముందు ఆ దేశ అధ్యక్షుడు రోషె కాబోర్ తెలిపారు.

సోల్హాన్ గ్రామంపై శుక్రవారం రాత్రి సాయుధులు డాడిచేసి ఇళ్లు, మార్కెట్లను తగులబెట్టారని ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ దాడులకు తెగ బడింది తామేనని ఇప్పటివరకు ఏ వార్తా సంస్థా ప్రకటించలేదు.

అయితే, ఇక్కడ ఇస్లామిక్ దాడులు ఎప్పటికప్పుడే జరుగుతుంటాయి. ముఖ్యంగా నైజర్, మాలిలకు సరిహద్దుల్లోని ప్రాంతాలపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి.

మరోవైపు శుక్రవారం రాత్రే సోల్హాన్‌కు ఉత్తరంగా 150 కి.మీ. దూరంలోని తదర్యత్ గ్రామంలో 14మందిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు.

గత నెలలో కూడా తూర్పు బుర్కినా ఫాసోలో జరిగిన దాడిలో 30 మంది మరణించారు.

2012లో ఉత్తర మాలిలోని కొన్ని ప్రాంతాలను సాయుధులు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచీ ఇక్కడ హింస చెలరేగుతోంది.

మాలి, చాద్, మారిటానియా, నైజర్, బుర్కినా ఫాసోల్లోని మిలిటెంట్లతో పోరాడుతున్న బలగాలకు ఫ్రాన్స్ బలగాలు సాయం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Burkina Faso: Gunmen shoot dead 132, seven children dead - Newsreel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X