యువ జర్నలిస్టు దారుణ హత్య - పెట్రోల్ పోసి నిప్పంటించి : బీహార్ లో దారుణం..!!
బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. యువ జర్నలిస్టును దారుణ హత్యకు గురయ్యాడు. బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన 22 ఏళ్ల బుద్ధినాథ్ జా అలియాస్ అవినాష్ జా లోకల్ న్యూస్ పోర్టల్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. నకిలీ క్లినిక్‌లపై రాసిన కథనాలను ఇటీవల తన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. నకిలీ ఆస్పత్రుల పేర్లను అందులో వెల్లడించారు. దీంతో అధికారులు సదరు అస్పత్రులను మూసివేశారు.కొన్నింటికీ జరిమాన విధించారు. నాటి నుంచి బుద్ధినాథ్‌కు పలు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.
తమ క్లినిక్‌లను బయటకు లాగొద్దని కోరుతూ కొందరు ఆ జర్నలిస్టుకు లంచం ఆశ చూపారు. అయినప్పటికీ జర్నలిస్టు తలొంచలేదు. దీంతో మంగళవారం రాత్రి అతన్ని కిడ్నాప్ చేశారు. బెనిపట్టీ లోహియా చౌక్‌లోని తన నివాసం వద్ద చివరిసారిగా మంగళవారం రాత్రి 10 గంటలకు కనిపించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బుద్ధినాథ్ నివాసం బెనిపట్టి పోలీసు స్టేషన్‌కు 400 మీటర్ల దూరంలో ఉంది. అయితే రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన బుద్ధినాథ్.. అక్కడున్న రోడ్డుపై తిరుగుతూ పలు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.

తన క్లినిక్ కూడా తెరిచే ఉంది. ల్యాప్ టాప్ ఆన్ చేసి ఉంది. చివరగా రాత్రి 9:58 గంటలకు కనిపించాడు. ఆ సమయంలో పసుపు రంగు స్కార్ఫ్ మెడలో వేసుకొని ఉన్నాడు. బుద్ధినాథ్ జా రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్ట్ ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. బెనిపట్టీకి ఐదు కిలోమీటర్ల దూరంలోని బెటౌన్ వద్ద జర్నలిస్టు ఫోన్ సిగ్నల్స్ బుధవారం రాత్రి 9 గంటల వరకు కట్ అయినట్లు గుర్తించారు.
పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ అక్కడ బుద్ధినాథ్ కనిపించలేదు. బెటౌన్ జాతీయ రహదారి పక్కన జర్నలిస్టు మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. చేతికి ఉన్న రింగ్, మెడలో ఉన్న బంగారు గొలుసు, కాలిపై ఉన్న గాయంతో అతను బుద్ధినాథ్ అని కుటుంబ సభ్యులు గుర్తించారు. జర్నలిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు నిర్ధారించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications