Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బస్సు-బోలెరో ఢీ.. 13 మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, బోలెరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డవారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదంతో క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం రోదనలతో మిన్నంటింది.

రాజస్థాన్‌లోని డందానియా పోలీసుస్టేషన్ పరిధిలోని బలేసర్ మండలం జోధ్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. 125వ జాతీయ రహదారి వద్ద బస్సు మహీంద్ర బోలెరోను ఢీ కొంది. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని బలెసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో ఎనిమిది మందిని జోధ్‌పూర్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 bus accident at jodhpur.. 13 killed, several injured

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. బస్సు ప్రమాద ఘటనలో అక్కడికక్కడే 13 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు పురుషులు కాగా ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. బస్సు ప్రమాదంతో ఆ ప్రాంగణమంతా క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+