వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bus Accident: విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

విహారయాత్రలో విషాదం నెలకొంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్‌ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. ఈ కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి తర్వాత ఘోరం జరిగింది. టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులతోపాటు ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో మొత్తం 36 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు, కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. టూరిస్ట్ బస్సు కెఎస్‌ఆర్‌టిసి బస్సు వెనుక భాగాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని కేరళ మంత్రి తెలిపారు.

bus accident in kerala: 9 killed, 38 injured after tourist bus in Keralas Palakkad

కేఎస్‌ఆర్‌టీసీ బస్సు కేరళలోని కొట్టారక్కర నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్తోంది, అందులో 81 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ముగ్గురు ప్రమాదంలో మరణించారని ఆయన పేర్కొన్నారు. ఎర్నాకులంలోని బసేలియోస్ విద్యానికేతన్ సీనియర్ సెకండరీ స్కూల్‌కు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లు విహారయాత్రకు టూరిస్ట్ బస్సులో వెళ్లారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారు పాలక్కాడ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆ రాష్ట్ర మంత్రి ఎం బి రాజేష్ పరామర్శించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ప్రమాదంపై విచాణకు ఆదేశించామని రెవెన్యూ మంత్రి కె. రాజన్ చెప్పారు.

English summary
Nine people, including five students, were killed after a private tourist bus hit a state-run KSRTC bus from behind at Vadakkenchery in Kerala's Palakkad, Kerala Road Transport Minister Antony Raju said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X