విషాదం: లోయలో పడిన పెళ్లి బస్సు, 35మంది మృతి

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు నదిలో పడపోవడంతో బస్సులోని 35మంది ప్రయాణికులు మరణించినట్లు సమాచారం. మిగితా వారికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 50మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Bus Carrying 50 People Falls into Stream in J&K

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వర్ష ప్రభావిత ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేసింది.

శ్రీనగర్‌లో నాలుగు ఫీట్లు ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో దక్షిణ కాశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరి, రియాసీ, జమ్మూ వైపున కుల్గాం, షోపియన్ ఉన్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+