వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాకితో బెదిరించి సినీ ఫక్కీలో 8 కోట్ల దోపిడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Businessman robbed of Rs 8 crore at gunpoint in Delhi
న్యూఢిల్లీ‌‌: దేశ రాజధాని ఢిల్లీలో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. అత్యంత భారీ దోపిడీల్లో ఇదొక్కటిగా భావిస్తున్నారు. సాయుధులు హోండా సిటీ కారును ఆపి డ్రైవర్‌ను తుపాకితో బెదిరించి 8 కోట్ల రూపాయల నగదును దోచుకెళ్లారు.

ఈ దోపిడీ మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. దోపిడీ దొంగలు వాడిన వాగనార్ కారును సంఘటనా స్థలంలోనే వదిలి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ నాటకం ఆడి డ్రైవర్‌తో వాదనకు దిగారు.

ఆ తర్వాత డ్రైవర్‌పైకి తుపాకి ఎక్కుపెట్టి అతన్ని కారులోంచి తోసేశారు. ఆ డబ్బులు ఎవరివి, అంత సాధారణ రీతిలో ఎందుకు తీసుకుని వెళ్తున్నారనే విషయాన్ని పోలీసులు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటువంటి దోపిడీయో 2012లో జరిగింది. అప్పుడు గార్డును కాల్చి చంపి 5.25 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారు. తాజా సంఘటనలో పోలీసులు హోండా సిటీ డ్రైవర్ రాకేష్‌ను సంఘటన గురించి విచారిస్తున్నారు. కరోల్‌బాగ్‌లోని ఓ వ్యక్తి ఇంటికి తాను డబ్బులు తీసుకుని వెళ్తున్నట్లు అతను తెలిపాడు.

దోపిడీదారులకు ముందే విషయం తెలుసునని, వారు కారులో వాహనాన్ని వెంబడించారని పోలీసులు అంటున్నారు. సరిహద్దులను మూసేసి, హోండా సిటీ కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీదారులను గుర్తించడానికి సిసిటివీ ఫుటేజీలను స్కాన్ చేశారు. దుండగులు వాడిన రెండో కారు హుందాయ్ వెర్నాను సంఘటనా స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary

 In one of the biggest robberies in Delhi, armed men waylaid a Honda City car carrying Rs 8 crore and robbed it after holding the driver at gunpoint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X