నిలబడి నీళ్లు పట్టిస్తున్న అధికారులు, ఐటీ హబ్ లో లోక్ సభ ఎన్నికల ఎఫెక్ట్, ప్రజలు మాత్రం !
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎలాగైనా ఎక్కువ సీట్లలో విజయం సాధించాలని పలు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అనేక జిల్లాలో నీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరులో తాగునీటి కోసం ప్రజలు నానా తిప్పలుపడుతున్నారు.
కర్ణాటకలో నీటి సమస్య ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుందని ప్రజలు అంటున్నారు. ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా తమిళనాడుకు కావేరీ నీరు వదిలేయడం, ఇప్పుడు బెంగళూరులో తాగునీటి కోసం ఆర్తనాదాలు చేస్తుండటంతో సామాన్య ప్రజలు సిద్దరామయ్య ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. బెంగుళూరులోని యశవంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని హారోహళ్లి వార్డు పరిధిలోని కెంపెగౌడ నగరలో తాగునీటి సమస్య గురించి తెలుసుకున్న బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

నీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ, సాఫీగా నీటి సరఫరా కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాయండహళ్లిలోని అంబేద్కర్ నగర్, పంతరపాళ్యలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గుర్తించిన అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి స్థానికులతో చర్చించారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు.

బెంగళూరు యూనివర్శిటీ పరిధిలోని జ్ఞానభారతి సమీపంలో తాగునీటిని సరఫరా చేసే 1000 ఎంఎం డయామీటర్ల పైపులైన్ గురువారం ఉదయం దెబ్బతింది. విషయం తెలిసిన వెంటనే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో కలిసి నాలుగు గంటలపాటు నిరంతరాయంగా పైప్ లకు మరమ్మతులు చేశారు. దీని ద్వారా మహాశివరాత్రి పర్వదినాల సందర్భంగా నగరానికి నిరంతరం నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు.












Click it and Unblock the Notifications