Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటమి ఎఫెక్ట్, ఈసీపై ఉద్ధవ్ థాకరే కొత్త డిమాండ్: కీలక కైరానాలో బీజేపీకి షాక్, ఓటమికి ఇదీ కారణం!

న్యూఢిల్లీ: మూడు రోజుల క్రితం వివిధ రాష్ట్రాల్లో 4 లోకసభ స్థానాలకు, 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 4 లోకసభ సీట్లకు గాను బీజేపీ, మిత్రపక్షం రెండు సీట్లు గెలుచుంది. ఆరు పార్టీలు కలిసి ఆర్ఎల్డీ అభ్యర్థిగా తబస్సుంను బరిలోగి దింపగా.. విపక్షాల ఐక్యతతో యూపీలో కీలకమైన కైరానా స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. మహారాష్ట్రలో మరో స్థానాన్ని.. కమలంను ఎదుర్కొనేందుకు మేజర్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీ-కాంగ్రెస్‌లకు కోల్పోయింది. ఇక్కడ ఎన్సీపీ అభ్యర్థి గెలిచారు.

ఆర్ఆర్ నగర్‌లో కాంగ్రెస్ గెలిచింది. మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా-గోండియా, నాగాలాండులోని సోలె, కైరానా లోకసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. నూర్పూర్(యూపీ), షాకోట్(పంజాబ్), జోకిహట్(బీహార్), గోమియా&సిల్లి(జార్ఖండ్), చెంగన్నూర్(కేరళ), పాలస్ కడేగాన్(మహారాష్ట్ర), అపంతి(మేఘాలయ), తరలి(ఉత్తరాఖండ్), మహేస్తల(పశ్చిమ బెంగాల్)లలో ఉప ఎన్నికలు జరిగాయి.

By Election Results 2018 LIVE Updates
By Election Results 2018 LIVE Updates

May 31, 2018, 6:11 pm IST

బీజేపీపై విమర్శలు చేస్తున్నప్పటికీ ఉద్ధవ్ థాకరేను నమ్మలేమని, ఆయన మొదట ఎన్డీయే నుంచి బయటకు వస్తేనే ప్రజలు నమ్ముతారని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.
May 31, 2018, 5:39 pm IST

బీజేపీకి మిత్రపక్షాలు అవసరం లేదని, పాల్‌ఘర్‌లో తిరిగి రీకౌంటింగ్ జరపాలని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాన్ని ప్రకటించవద్దని, అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు.
May 31, 2018, 4:54 pm IST

ఫల్‌ఘర్ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన శివసేన మళ్లీ ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తోంది. 23, 24వ రౌండ్ నుంచి ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసింది.
May 31, 2018, 4:52 pm IST

ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రాణించకపోవడంపై ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. ఒక పెద్ద అడుగు వేసేందుకు రెండు అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో మేం చాలా పెద్ద అడుగు వేస్తామని చెప్పారు. తద్వారా 2019లో తిరిగి బీజేపీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
May 31, 2018, 4:32 pm IST

జేడీయు - బీజేపీలు డబ్బు వెదలజల్లాయని అయినప్పటికీ గెలవలేకపోయాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. పెట్రో ధరలు పెరుగుతున్నాయని, దీనిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, అందుకే తాము ఓడిపోయామని జేడీయూ నేత త్యాగి అన్నారు.
May 31, 2018, 3:31 pm IST

ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, లెఫ్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం కైరానాలో గెలుపొందారు. దీనిపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. తమకు ఓటు వేసిన ప్రజలకు శుభాకాంక్షలు అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారు ఓడిపోయారన్నారు. బీజేపీకి ప్రజలు ఓటుతో మంచి సమాధానం చెప్పారన్నారు.
May 31, 2018, 3:13 pm IST

మేఘాలయలోని అంపతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మియాని డి షిరా గెలుపొందడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
May 31, 2018, 3:12 pm IST

మహారాష్ట్రలోని బాంద్రా - గోండియా లోకసభ స్థానంలో కాంగ్రెస్ మద్దతిచ్చిన ఎన్సీపీ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఆ రెండు పార్టీల కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
May 31, 2018, 2:52 pm IST

బీజేపీకి చాలామంది ఓట్లు వేశారని, అయినప్పటికీ ప్రతిపక్ష అభ్యర్థి గెలిచారని, గెలిచిన అభ్యర్థి తబస్సుంకు తాను అభినందనలు తెలుపుతున్నానని, బీఎస్పీ, ఎస్పీ, ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, సీపీఎంలతో కూడిన అలయెన్స్ తమపై గెలుపొందిందని, ఆ అలయెన్స్‌కు అనుగుణంగా తాము సమాయత్తమవుతామని కైరానా బీజేపీ అభ్యర్థఇ మృగాంకా సింగ్ అన్నారు.
May 31, 2018, 2:22 pm IST

యూపీలోని కైరానా లోకసభ స్థానంలో బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్‌పై ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం గెలుపొందారు. ఆర్ఎల్డీకి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం మద్దతిచ్చాయి. ఓ విధంగా ఆరు పార్టీలు కలిసి బీజేపీపై పోటీ చేశాయి.
May 31, 2018, 2:12 pm IST

కైరానా లోకసభ ఎన్నికల్లో విజయం దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి మాట్లాడుతూ.. తమకు మద్దతిచ్చిన అఖిలేష్ యాదవ్, మాయావతి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలకు థ్యాంక్స్ చెప్పారు.
May 31, 2018, 2:01 pm IST

మాకు మద్దతునిచ్చిన ప్రతీ పార్టీకి ధన్యవాదాలు. అఖిలేశ్, మాయావతి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీపీఎం, ఆమ్ ఆద్మీలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిన్నా ఓడాడు గన్నా గెలిచాడు: జయంత్ చౌదరి, ఆర్.ఎల్.డి
May 31, 2018, 1:52 pm IST

పంజాబ్ షాకోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు, భండారా-గోందియా లోక్ సభ నియోజకవర్గంలో 20,583ఓట్ల ముందంజలో ఎన్.సి.పి
May 31, 2018, 1:41 pm IST

ఉత్తరాఖండ్ తరలిలో బీజేపీ గెలుపు -ఉత్తరాఖండ్‌లోని తరలి నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందింది.
May 31, 2018, 1:40 pm IST

నూర్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ గెలవడంతో సంబరాలు చేసుకుంటున్న ఆ పార్టీ కార్యకర్తలు.
May 31, 2018, 1:36 pm IST

10 అసెంబ్లీ, 4 లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు, ఆర్ఆర్ నగర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. దీంతో బీజేపీ ఎక్కువ స్థానాల్లో దెబ్బతిన్నది.
May 31, 2018, 1:35 pm IST

జార్ఖండ్ గోమియాలో జేఎంఎం గెలుపు - జార్ఖండ్ రాష్ట్రంలోని గోబియాలో జేఎంఎం అభ్యర్థఇ బబితా దేవి గోమియా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆమె ఏజేఎస్‌యూ అభ్యర్థి లంబోదర్ మహతోపై విజయం సాధించారు.
May 31, 2018, 1:17 pm IST

కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాశనం చేయాలని చూస్తోందన్నారు.
May 31, 2018, 1:16 pm IST

జేడీయు పైన మా ఆధిక్యత ఎంత ఉందో అన్ని ఓట్లు కూడా వారికి రాలేదని తేజస్వి యాదవ్ అన్నారు.
May 31, 2018, 1:14 pm IST

ప్రత్యేక హోదా విషయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మౌనం, ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీతో కలిసినందుకు జేడీయుకు ప్రజలు జోకిహాట్‌లో బుద్ధి చెప్పారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
May 31, 2018, 12:59 pm IST

జార్ఖండ్ సిల్లిలో జేఎంఎం గెలుపు - జార్ఖండ్‌లోని సిల్లి నియోజకవర్గంలో జార్ఖండ్ ముక్తి మోర్చా గెలుపొందింది.
May 31, 2018, 12:58 pm IST

బీహార్ జోకిహాట్‌లో ఆర్జేడీ గెలుపు - బీహార్‌లోని జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి షాహన్వాజ్ గెలుపొందారు. ఇక్కడ నిన్నటి వరకు జేడీయూ అధికారంలో ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆర్జేడీ 40వేల పై చిలుకు ఓట్లతో గెలిచింది.
May 31, 2018, 12:56 pm IST

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు - ఆర్ఆర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు బీజేపీ అభ్యర్థిపై 41,162 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
May 31, 2018, 12:55 pm IST

ఫాల్‌ఘర్‌లో ఓటమిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈవీఎంలు సరిగా లేవని, 50 వేల నుంచి 60 వేల వరకు ఓటర్ల పేర్లు అదృశ్యమయ్యాయని, ఈసీ ఓటింగ్ పర్సెంటేజ్‌ను కూడా మార్చిందని ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.
May 31, 2018, 12:48 pm IST

కేరళ చెంగనూరులో సీపీఎం గెలుపు - కేరళలోని చెంగనూర్‌లో సీపీఎం స్థానాన్ని నిలబెట్టుకుంది. 20,956 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై సీపీఎం సజీ చెరియన్ గెలిచారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.
May 31, 2018, 12:47 pm IST

మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో బీజేపీ గెలుపు - పాల్‌ఘర్ లోకసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గవిట్ రాజేంద్ర శివసేన అభ్యర్థిపై 24వేల ఓట్ల తేడాతో గెలిచారు.
May 31, 2018, 12:46 pm IST

మేఘాలయ అంపతిలో గెలుపు - అంపతిలో కాంగ్రెస్ అభ్యర్థి మిలాని డీ షీరా గెలుపొందారు. దీంతో మేఘాలయలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
May 31, 2018, 12:45 pm IST

యూపీ నూర్పూర్‌లో గెలుపు - యూపీలోని నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. బీజేపీ నేత లోకేంద్ర సింగ్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ సమాజ్ వాది పార్టీ అభ్యర్థి నయీమ్ ఉల్ హసన్ గెలుపొందారు. విపక్షాల ఐక్యతతో బీజేపీ ఓడిపోయింది. 6,211 ఓట్లతో గెలిచారు.
May 31, 2018, 12:33 pm IST

ఆర్ఆర్ నగర్‌‌లో 14వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న నాయుడు 97,440 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి 56,278, జేడీఎస్ అభ్యర్థి 45,345 ఓట్లు సాధించారు.
May 31, 2018, 12:32 pm IST

నాగాలాండ్ లోకసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ముందంజలో ఉంది. నాగా పీపుల్స్ ఫ్రంట్ కంటే 34వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+