కొత్త నోట్లు ఇస్తే పొలో అంటూ పోలింగ్ కేంద్రాలకు
తమిళనాడులో దాదాపు 7.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
చెన్నై: తమిళనాడుతో సహ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఓటింగ్ జోరందుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ లో శనివారం ఉదయం నుంచి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓట్లు వేస్తున్నారు.
తమిళనాడులోని తిరుప్పరన్ కుంద్రం, తంజావూర్, అరవక్కురిచ్చి శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో ఒక శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరుగతున్నాయి.

తమిళనాడులో దాదాపు 7.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
దేశంలోని వివిధ చోట్ల జరుగుతున్న ఉప ఎన్నికల్లో కొందరు నాయకులు కొత్త నోట్లను ఓటర్లకు ఇవ్వడంతో పొలో అంటూ పోలింగ్ కేంద్రాలకు పరుగు తీశారు.
పశ్చిమ బెంగాల్ లోని కుచ్ బెహర్, తమ్లక్ లోక్ సభ స్థానాలు, మాంతేశ్వర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ నేత వి. నారాయణస్వామి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థి శక్తి సెగర్ కు గట్టి పోటీ ఎదురైయ్యింది.
ఇక అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సోంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని సమాచారం. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థులకు ప్రతిపక్ష పార్టీ డీఎంకే అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తున్నారు. తమిళనాడులో మాత్రం ఉప ఎన్నికల్లో నువ్వా నేనా అంటు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈనెల 22వ తేది ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.












Click it and Unblock the Notifications