వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ కోలాహలం: బద్వేలు, హుజూరాబాద్‌ సహా 30 చోట్ల: ఆ లోక్‌సభ సీట్లల్లో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల కోలాహలం నెలకొంది. కడప జిల్లాలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ సహా 30 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. వాటితో పాటు మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఈ పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్న వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది.

మండుతున్న త్రిపుర: రెండు వర్గాల మధ్య దాడులు-ప్రతిదాడులు: కాళీ ఆలయం ధ్వంసంమండుతున్న త్రిపుర: రెండు వర్గాల మధ్య దాడులు-ప్రతిదాడులు: కాళీ ఆలయం ధ్వంసం

 ఏపీ, తెలంగాణ సహా..

ఏపీ, తెలంగాణ సహా..

పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరణించడంతో పాటు కొంతమంది రాజీనామాలు, మరికొంతమంది పార్టీ ఫిరాయింపుల కారణంగా ఈ ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణం వల్ల..ఏపీలోని కడపజిల్లా బద్వేలు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

హుజూరాబాద్‌తో త్రిముఖ పోరు..

హుజూరాబాద్‌తో త్రిముఖ పోరు..

అధికార టీఆర్ఎస్‌కు చెందిన శాసన సభ్యుడు ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ స్థానానికి బైపోల్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. బద్వేలులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు. తమ అభ్యర్థిని నిలపలేదు. హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు నెలకొని ఉంది. టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..

అసెంబ్లీ ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే..

అస్సాం- గొస్సాయ్‌గావ్, భబానీపూర్, తముల్‌పూర్, మరియాని, థోవ్రా, బిహార్‌-కుశేశ్వర్ అస్థాన్, తారాపూర్, హర్యానా-ఎల్లెనాబాద్, హిమాచల్ ప్రదేశ్-ఫతేపూర్, అర్కి, జుబ్బల్-కొట్‌ఖైలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కర్ణాటక-సింద్గి, హంగల్, మధ్యప్రదేశ్-పృథ్వీపూర్, రాయ్‌గావ్, జొబాట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో నాందెడ్ జిల్లా డెగ్లూర్ స్థానానికి పోలింగ్ ఆరంభమైంది. మేఘాలయా, నాగాలాండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌లల్లో ఉప ఎన్నికల పోలింగ్ సందడి నెలకొంది.

 వెబ్ కెమెరాల పర్యవేక్షణ..

వెబ్ కెమెరాల పర్యవేక్షణ..

ఉప ఎన్నికలను ఎదర్కొంటోన్న అన్ని స్థానాల్లోనూ పోలీసుల బందోబస్తు కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను అమర్చారు. వేర్వేరు పార్టీకలు చెందిన నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందంటూ అనుమానాలు వ్యక్తమైన చోట్ల వెబ్ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.

Recommended Video

Germany: Pilots Return To Work To Cover Tourism Demand
స్థానిక రాజకీయాలపై ప్రభావం..

స్థానిక రాజకీయాలపై ప్రభావం..

పశ్చిమ బెంగాల్‌లోని దిన్హాట, శాంతిపూర్, ఖర్దాహ, గోసాబా స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో దిన్హాటా, శాంతిపూర్ లోక్‌సభ స్థానాలు. ఈ రెండు స్థానాల సిట్టింగ్ ఎంపీలు నిషిత్ ప్రామాణిక్, జగన్నాథ్ సర్కార్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అవసరం అయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలు.. స్థానిక రాజకీయాలను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఒకేసారి 30 స్థానాలకు ఎన్నికలను నిర్వహించడం వల్ల కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటాయా? లేదా? అనేది నవంబర్ 2వ తేదీన తేలుతుంది.

English summary
By-elections in 3 Lok Sabha seats & 30 Assembly constituencies across 14 states, begin
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X