మళ్లీ తెరపైకి సీఏఏ.. అప్పుడు అమలు, అమిత్ షా ఇండికేషన్
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. పార్లమెంట్ హౌస్‌లో తనను కలిసేందుకు వచ్చిన పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారికి ఈ మేరకు హామీ ఇచ్చారు.
బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగానే దీనిని అమలు చేస్తామన్నారు. పౌరసత్వ సవరణల చట్టం 2019 డిసెంబర్‌లో పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మత హింస తట్టుకోలేక 2014 డిసెంబర్ 31 నాటికి భారత్ చేరుకున్న ముస్లిమేతరులకు అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
ఈ చట్టం ప్రకారం ఏ భారతీయుడికీ పౌరసత్వం పోదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఏఏకి వ్యతిరేకంగా గతంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. వద్దని కోరాయి. కానీ అవీ కుట్రతో ఆందోళనలు చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. మళ్లీ ఇప్పుడు ఆ అంశం తెరపైకి వచ్చింది.

పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ నుంచి భారత దేశానికి వలస వచ్చే ముస్లిమేతరలకు పౌరసత్వము ఇవ్వడానికి ఉద్దేసించినది. ఆయా దేశాలలో మతపరమైన దాడుల నుండి తప్పించుకోవడానికి దేశములోనికి వచ్చేవారికనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం.
పౌరసత్వ చట్టం ఇప్పటికి ఐదు సార్లు సవరించారు. 1986,1992,2003,2005 2015 వీటిలో మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో, రెండూ సార్లు బీజేపీ ప్రభుత్వ హయాంలో సవరణలు జరిగాయి. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరిస్తుంది.












Click it and Unblock the Notifications