అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు, ఎవరు అర్హులు: అసదుద్దీన్ సహా వారు ఏమన్నారంటే?
Recommended Video

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈబీసీ - ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లను 10 శాతం నిర్ణయిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయనుంది. ఈబీసీ కోటాపై రేపు (మంగళవారం) లోకసభలో జనరల్ ఓటింగ్ జరిగే అవకాశముంది.
రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు మోడీ తీసుకున్న సంచలన నిర్ణయమని చెప్పవచ్చు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాలలో పది శాతం కోటా కల్పించనున్నారు.

ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఎలా ఉన్నాయంటే?
ఇప్పటి వరకు రిజర్వేషన్లు 49.5 శాతంగా ఉన్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పది శాతం ఇవ్వడం ద్వారా 59.5 శాతానికి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్లు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం ఉన్నాయి. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు పది శాతం ఇవ్వడం ద్వారా ఈ రిజర్వేషన్లు దాదాపు అరవై శాతానికి వచ్చినట్లవుతుంది.

రిజర్వేషన్లను సమీక్షించాలని నాడే చెప్పారు
రిజర్వేషన్లను అయిదేళ్ల తర్వాత సమీక్షించాలని రాజ్యాంగ నిర్మాతలు దశాబ్దాల క్రితమే చెప్పారు. కానీ తర్వాత వస్తున్న ప్రభుత్వాలు ఎప్పటికి అప్పుడు ఈ రిజర్వేషన్లను పొడిగిస్తూ వస్తున్నాయి. ఆ తర్వాత రిజర్వేషన్లను ఇతర రంగాలలోను అమలుపరిచారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని ఉంది. సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది. కానీ తమిళనాడు రిజర్వేషన్లు 69 శాతంగా ఉంది.

ఎవరు అర్హులు అంటే?
వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన వారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు. వెయ్యి గజాలలోపు ఇంటి స్థలం ఉన్న అగ్రవర్ణాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. అయిదు ఎకరాల లోపు పొలం ఉన్న వారు కూడా అర్హులు. అలాగే, నోటిఫై చేసిన మున్సిపాలిటీలో 100 చదరపు అడుగుల లోపు ప్లాట్, నోటిఫై కాని ఏరియాలో 200 యార్డుల లోపు ప్లాట్ ఉండాలి. కాగా, ఎన్నికలకు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపటి (మంగళవారం)తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇందుకోసం రెండు రోజుల పాటు పొడిగించే అవకాశముంది.
ఎవరేమన్నారంటే?
కేంద్రం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై పలువురు నేతలు స్పందించారు. ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ.. ఆర్టికల్స్ 15, 16లు ఎస్సీ, ఎస్టీ, సామాజికంగా వెనుకబడిన వారి రిజర్వేషన్ల గురించి మాత్రమే ఉందని, రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటుకు రావాలని వ్యాఖ్యానించారు. కేవలం న్యూస్ కోసమే ఇలా చేస్తున్నారన్నారు.
బీజేపీ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్ మాట్లాడుతూ.. ఇది మంచి నిర్ణయమని, అగ్రకులాల్లోని పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
ఇదంతా వట్టిదేనని పటీదార్ నేత హార్దిక్ పటేల్ అన్నారు. కేంద్రం నుంచి ఇది మరో లాలీపాప్ అని ఎద్దేవా చేశారు. కేవలం అగ్రవర్ణాలను ఆకట్టుకోవడానికే ఇలా చేశారన్నారు. ఇటీవల అగ్రవర్ణాలు కాంగ్రెస్ వైపు మరలాయని, వారిని తిరిగి ఆకట్టుకునే ప్రయత్నమన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కూడా పది శాతం రిజర్వేషన్లను ఎన్నికల ముందు జిమ్మిక్కుగా అభిప్రాయపడ్డారు.

అసదుద్దీన్ ఓవైసీ
ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు వచ్చాయన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు ఉంటాయన్నారు. కాగా, ఇలా మాట్లాడుతున్న అసదుద్దీన్.. మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇదే మాట మాట్లాడలేదని మరికొందరు అంటున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications