ఈ రాష్ట్రాలకు భారీ శుభవార్త.. 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు గుడ్ న్యూస్ ప్రకటించింది. రైల్వే నెట్ వర్క్ ను మరింత విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే నెట్ వర్క్ ను మరో 894 కి. మీ. పెంచేందుకు కేబినెట్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టులకు రూ. 24,634 కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్ట్ లు 2030-31 లోపు పూర్తి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రలోని వార్ధా నుంచి భూసవాల్ మధ్య 314 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ లు నిర్మించనుంది. అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల మధ్య గోండియా నుంచి డోంగార్గర్ ప్రాంతం వరకు 84 కిలోమీటర్లు, గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్య వడోదరా నుంచి రట్లాం వరకు 259 కిలోమీటర్లు అలాగే మధ్య ప్రదేశ్ లోని ఇటార్సీ- భోపాల్- బినా మధ్య 237 కిలోమీటర్లు రైల్వే ప్రాజెక్ట్ లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని 18 జిల్లాలను ఈ రైల్వే ప్రాజెక్టులు కవర్ చేయనున్నాయి.
ఈ రైల్వే ప్రాజెక్టులు పీఎం- గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ లు ప్రజా రవాణా, వస్తు రవాణా, సేవలకు వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్ట్ లు ప్రముఖ ప్రాంతాలైన సాంచీ స్థూపం, సత్పురా టైగర్ రిజర్వ్, రాక్ షెల్టర్, హజారా ఫాల్స్, నవేగావ్ నేషనల్ పార్క్ లను కవరింగ్ చేయనుంది. అలాగే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టుల వల్ల 3,633 గ్రామాలు, 85.84 లక్షల మంది ప్రజలకు ప్రయాణ సదుపాయం కల్పించనుంది.

ఇదే విషయంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. " రైల్వేలకు సంబంధించి 4 కీలక ప్రాజెక్టులను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మనకు 7 కారిడార్లు ఉన్నాయి. 41 శాతం రైల్వే ట్రాఫిక్ కవర్ అవుతుంది. ఈ 7 కారిడార్లు 41 శాతం కార్గో, 41 శాతం పాసింజర్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications