ఇన్ఫోసిస్‌కు సీఏఐటీ ‘కోర్టు’ హెచ్చరిక: జీఎస్టీఎన్ మొరాయింపుపై గగ్గోలు

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆలిండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్(సీఏఐటీ) కోర్టుకెళతామంటూ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను బెదిరింపులకు గురిచేస్తోంది. ఎందుకంటే.. జీఎస్టీ చట్టం అమలుకు అవసరమైన సాంకేతిక వనరులను సమకూర్చేందుకు ఏర్పాటుచేసిన జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌ మొరాయించడమే. ఈ క్రమంలోనే విసుగెత్తి పోయిన ట్రేడర్ల బాడీ సీఏఐటీ, ఇన్ఫోసిస్‌కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే, ఇక తమ దగ్గర ఎలాంటి ఆప్షన్‌ ఉండబోదని, కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఆ నెట్‌వర్క్‌తో బాధలు

ఆ నెట్‌వర్క్‌తో బాధలు

కంపెనీ అందించిన జీఎస్టీ పోర్టల్‌.. వర్తకులను బాగా ఇబ్బందులకు గురిచేస్తోందని, ఇది విజయవంతం అవడానికి అవాంతరాలు సృష్టిస్తుందని తెలిపింది. రూ.1400 కోట్లలో కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఇన్ఫోసిస్‌, ఇతర కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదని తెలిపింది.

కొట్టిపారేస్తున్న ఇన్ఫోసిస్

కొట్టిపారేస్తున్న ఇన్ఫోసిస్

జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌లో అవాంతరాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలను ఇన్ఫోసిస్‌ ఖండిస్తోంది. పూర్తిగా ఇవి అవాస్తమని తెలుపుతోంది. దీనిపై ట్రేడర్ల బాడీ సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా..

ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా..

ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా వెంటనే చర్యలు తీసుకోకపోతే, తమ దగ్గర ఇక ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, దీనిలో కోర్ట్ ఆఫ్ లా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ప్రజా సంపదను దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని పేర్కొంది.

ట్రేడర్ల గగ్గోలు..

ట్రేడర్ల గగ్గోలు..

ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ ప్రాజెక్టులో తాము భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణమని ఐటీ దిగ్గజం నవంబర్ మొదట్లో ఓ ప్రకటన చేసింది. అయితే, గత కొద్ది రోజులుగా జీఎస్టీఎన్‌ నెట్‌వర్క్‌లో సమస్యలు ఎదురవుతున్నాయని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ మొరాయిస్తుండటంతో తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. కాగా, జీఎస్టీఎన్ ప్రాజెక్టును ఎంతో నిపుణులైన వారితో రూపొందించడం జరిగిందని, ఏవైనా లోపాలుంటే సరిదిద్దడం జరుగుతుందని ఇన్ఫోసిస్ తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Confederation of All India Traders has said if no action is taken against Infosys for poor implementation of the GST portal, “it will have no other alternative left but to take shelter of the Court of Law”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X