Camera: హోటల్ లో సీక్రేట్ కెమెరాలు, ఎంజాయ్ చేసిన జంట, వాళ్ల వీడియోలు వాళ్లే చూసి ?
నోయిడా/న్యూఢిల్లీ: యువకుడు, ఓ మహిళ ఏకాంతంగా కలుసుకోవాలని అనుకున్నారు. ఆన్ లైన్ లో ఓ హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నారు. హోటల్ కు వెళ్లిన ఆ జంట ఏకాంతంగా గడిపారు. హోటల్ లో ఎంజాయ్ చేసిన జంట తరువాత హోటల్ రూమ్ ఖాళీ చేసి ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయారు. హోటల్ రూమ్ లో ఆ జంట ఏకాంతంగా గడిపే సమయంలో సీక్రేట్ కెమోరాలతో వీడియోలు తీసిన నిందితులు ఆ వీడియోలను యువకుడికి పంపించారు. వీడియో చూసిన యువకుడు బిత్తరపోయాడు. మరుసటి రోజు ఆ వీడియోను ఆ మహిళకు కూడా షేర్ చెయ్యడంతో ఆమె హడలిపోయింది.

ఓయో హోటల్ లో రూమ్ బుక్
నోయిడాలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు ఓ మహిళ ఏకాంతంగా కలుసుకోవాలని అనుకున్నారు. బయట తిరిగితే లేనిపోని సమస్యలు వస్తాయని అనుకున్న ఆ జంట హోటల్ లో రూమ్ తీసుకుని ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నారు. నోయిడాలో ఓయో హోటల్ లో ఆ జంట రూమ్ బుక్ చేసుకున్నారు.

హోటల్ లో ఎంజాయ్ చేసి వెళ్లిపోయారు
హోటల్ కు వెళ్లిన ఆ జంట ఏకాంతంగా గడిపారు. హోటల్ రూమ్ లో అక్కడ పని చేసే సిబ్బందితో కావలసిన ఫుడ్ తెప్పించుకున్నారు. రెండు రోజులు హోటల్ లో ఎంజాయ్ చేసిన ఆ జంట తరువాత హోటల్ రూమ్ ఖాళీ చేసి ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయారు. హోటల్ లో ఎంజాయ్ చేసిన తీపిగుర్తులతో యువకుడు ఊగిపోతున్న సమయంలో అతని మొబైల్ కు షాకింగ్ వీడియో షేర్ అయ్యింది.

అడిగినంత డబ్బులు ఇవ్వాలి
హోటల్ రూమ్ లో ఆ జంట ఏకాంతంగా గడిపే సమయంలో సీక్రేట్ కెమోరాలతో వీడియోలు తీసిన నిందితులు ఆ వీడియోలను యువకుడికి పంపించారు. వీడియో చూసిన యువకుడు బిత్తరపోయాడు. మరుసటి రోజు ఆ వీడియోను ఆ మహిళకు కూడా షేర్ చెయ్యడంతో ఆమె వీడియో ఆమె చూసుకుని హడలిపోయింది.

పక్కాప్లాన్ వేసిన పోలీసులు
మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మీరు నగ్నంగా రొమాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. బాధితులు నోయిడా పోలీసులను ఆశ్రయించారు. పక్కా స్కెచ్ వేసిన పోలీసులు డబ్బులు ఇస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని పిలిపించారు.

7 ల్యాప్ టాప్ లు, 22 ఏటీఎం కార్డులు
డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన విష్ణుసింగ్, అబ్దుల్ వహాబ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్ సింగ్ అనే యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 11 ల్యాప్ టాప్ లు, 7 సిమ్ కార్డులు, 21 మొబైల్ ఫోన్లు, వివిద బ్యాంకులకు చెందిన 22 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు.

కిలాడీల స్కెచ్
నిందితులు మొదట రూమ్ బుక్ చేసుకుని ఆ రూమ్ లో సీక్రేట్ కెమెరాలు ఫిట్ చేసి రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. తరువాత ఆ రూమ్ లో ఏకాంతంగా గడిపుతున్న వారి వీడియోలు రికార్డు చేస్తున్నారు. రెండు మూడు రోజుల తరువాత మళ్లీ అదే రూమ్ బుక్ చేసుకుని సీక్రేట్ కెమెరాలు తీసుకుని వెళ్లిపోతున్నారు.

ఇద్దరు వీడియోలు తీస్తే.. మిగిలినవాళ్లు ?
హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న జంటలను బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారుల విచారలో వెలుగు చూసింది. విష్ణు సింగ్, వహాబ్ వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటే మిగిలిన ఇద్దరు డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications