సీబీఐ వల్లే తాను భారత్ రాలేకపోతున్నా, ఇదీ కారణం: నీరవ్ మోడీ
న్యూఢిల్లీ: సీబీఐ కారణంగానే తాను భారత దేశానికి రాలేకపోతున్నానని ప్రముఖ వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ అన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్ ప్రధాన నిందితుడు. విదేశాల్లో తలదాడుకున్నాడు.
ఆయనను రప్పించేందుకు సీబీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో నీరవ్ మాట్లాడాడు. సీబీఐ వల్లే తాను రాలేకపోతున్నట్లు చెప్పారు.

సీబీఐ పంపించిన మూడో డిజిటల్ సమన్లకు ఆయన మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చాడు.
లోయర్ పరేల్‌లోని తన కార్యాలయం సర్వర్లను సీబీఐ స్వాధీనం చేసుకుందని, ఈ సమయంలో తాను భారత్ వస్తే చట్ట ప్రకారం తనను తాను కాపాడుకునేందుకు తన ప్రాథమిక హక్కులను పూర్తిగా వినియోగించుకోలేనని, విచారణ అధికారులకు సరైన సమాచారం అందించలేకపోతానని పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications