బక్రీద్‌కు కరోనా నిబంధనల సడలింపు రద్దు చేస్తారా లేదా కోర్టుకు వెళ్లాలా?: కేరళకు ఐఎంఏ అల్టిమేటం
తిరువనంతపురం: ఓ వైపు రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో కేరళ ప్రభుత్వం బక్రీద్ కోసం కరోనా నిబంధనలను సడలించడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేగాక, బక్రీద్ సడలింపులను రద్దు చేస్తారా? లేక కోర్టుకు వెళ్లమంటారా? అని కేరళ పినరయి విజయన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.
తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పింది. డిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్ లాంటి పలు రాష్ట్రాలు ఏటా జరిపే ప్రఖ్యాత తీర్థయాత్రలను, ఉత్సవాలను రద్దు చేసినట్లు గుర్తు చేసింది. ఇలాంటి తరుణంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడే బక్రీద్ పండగకు అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దురదృష్ణకరమని ఐఎంఏ వ్యాఖ్యానించింది.

దేశం విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కేరళ ప్రభుత్వం తక్షణం తన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఐఎంఏ బలంగా కోరుతోంది. కరోనా నిబంధనల విషయంలో ఎంతమాత్రం రాజీపడకూడదు. రాష్ట్రంతోపాటు యావద్దేశ భద్రతకు పాటుపడాల్సిన బాధ్యత విస్మరించాదని ఐఎంఏ కోరింది.
కరోనా నిబంధనలను పాటించని పక్షంలో కేరళ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామని ఐఎంఏ స్పష్టం చేసింది. బక్రీద్‌కు ఆంక్షల సడలింపుల నిర్ణయాన్ని బీజేపీ, కాంగ్రెస్ కూడా కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. కరోనా కేసులు మరింత పెరిగేలా పినరయి విజయన్ నిర్ణయం ఉందని కేంద్రమంత్రి మురళీధరన్ వ్యాఖ్యానించారు. ఆంక్షల సడలింపు నిర్ణయం సరికాదని కాంగ్రెస్ నేత
అభిషేక్ సింఘ్వి వ్యాఖ్యానించారు.
Recommended Video
కాగా, సెకండ్ వేవ్‌లో కేరళలో అత్యధిక కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత కొద్ది వారాలుగా రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను సడలిస్తూ కేరళ సర్కారు తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications