శ్రీదేవి మృతిపై విచారణకు పిటిషన్: తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..

న్యూఢిల్లీ: శ్రీదేవి మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సునీల్ సింగ్ అనే ఫిలిం మేకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ ను విచారణకు స్వీకరించబోమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా.. శ్రీదేవి మరణంపై ఇదివరకే దుబాయ్, భారతీయ అధికారులు విచారించారని అన్నారు. కాబట్టి దీనిపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

Cant interfere: SC dismisses plea seeking probe into Sridevis death

కాగా, శ్రీదేవి మరణించిన సమయంలో.. తాను కూడా దుబాయిలోనే ఉన్నట్టు పిటిషనర్ సునీల్ సింగ్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లినట్టు చెప్పారు. శ్రీదేవి మృతి చెందిన హోటల్ సిబ్బందితో తాను మాట్లాడానని, అలాగే శ్రీదేవిని తరలించిన ఆసుపత్రి సిబ్బందితోనూ మాట్లాడానని, ఈ వ్యవహారం తనకు వివాదాస్పదంగా అనిపించిందని చెప్పుకొచ్చారు.

కాగా, ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయి వెళ్లిన శ్రీదేవి(54).. ఫిబ్రవరి 24న హోటల్ గదిలోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+