చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CCTV: కారు పేలుడు కేసులో ట్విస్ట్, ముబిన్ ఫ్రెండ్స్ అందర్, అర్దరాత్రి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు, భార్యకు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబత్తూరు: కోయంబత్తూరులో శివుడి దేవాలయం ముందు కారు పేలుడు జరిగిన కేసులో పోలీసులు సీసీటీవీ పుటేజీలు స్వాధీనం చేసుకున్నారు. కారు పేలుడులో సజీవదహనం అయిన జమేజా ముబిన్ అలియాస్ ముబిన్ గురించి పోలీసు అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ నుంచి తప్పించుకుని కారు పేలుడులో సజీవదహనం అయిన ముబిన్ ఇంటిలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన రోజు రాత్రి ముబిన్ ఇంటి నుంచి ఐదు మంది రహస్యంగా గుర్తు తెలియని పదార్థాలు కారులో లోడ్ చేస్తున్న సీసీటీవీ పుటేజీలు పోలీసులకు చిక్కాయి. ముబిన్ చనిపోవడంతో మిగిలిన నలుగురి కోసం గాలించిన పోలీసులు అందరిని అదుపులోకి తీసుకున్నారు. దీపావళి బోనస్ గా పోలీసులకు మరో వ్యక్తి చిక్కిపోయాడు. సీసీటీవీ పుటేజీల దెబ్బతో మొత్తం మ్యాటర్ బయటకు వస్తుందని తెలిసింది. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి కేసు విచారణలో చేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.

Girlfriend: వన్ సైడ్ లవ్, యువతి గొంతు చీల్చి, తలను సుత్తితో?, కత్తితో18 చోట్ల కోసిన శాడిస్టు !

శివుడి గుడి ముందు ఆరాచకం

శివుడి గుడి ముందు ఆరాచకం


తమిళనాడులోని కోయంబత్తూరు సిటీలోని ఉక్కడం ఏరియాలోని కన్నప్పన్ నగర్ లోని పురాతన కోట ఈశ్వరన్ ఆలయం (శివుడి దేవాలయం) ముందు వేకువ జామున నాలుగు గంటల సమయంలో కారులో పేలుడు సంభవించింది. మొదట కారులో గ్యాస్ సిలిండర్ పేలడం వలన పేలుడు జరిగిందని అందరూ అనుకున్నారు.

ఆరోజు తప్పించుకుని ఈ రోజు శివుడి ఆజ్ఞతో

ఆరోజు తప్పించుకుని ఈ రోజు శివుడి ఆజ్ఞతో

కారు పేలుడులో సజీవదహనం అయిన ముబిన్ గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ 2019లోల ఎన్ఐఏ అధికారులు ముబిన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ రోజు ముబిన్ అతి ట్యాలెంట్ తో ఎన్ఐఏ అధికారుల నుంచి తప్పించుకుని ఈ రోజు శివుడి ఆలయం ముందే సజీవదహనం అయ్యాడు.

ఇంటిలో పేలుడు పదార్థాలు స్వాధీనం

ఇంటిలో పేలుడు పదార్థాలు స్వాధీనం

కోయంబత్తూరులో కారు పేలుడులో సజీవదహనం అయిన జమేజా ముబిన్ అలియాస్ ముబిన్ గురించి పోలీసు అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ నుంచి తప్పించుకుని కారు పేలుడులో సజీవదహనం అయిన ముబిన్ ఇంటిలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

సీసీటీవీ క్లిప్పింగ్స్

సీసీటీవీ క్లిప్పింగ్స్

పేలుడు జరిగిన రోజు రాత్రి ముబిన్ ఇంటి నుంచి ఐదు మంది రహస్యంగా గుర్తు తెలియని పదార్థాలు కారులో లోడ్ చేస్తున్న సీసీటీవీ పుటేజీలు పోలీసులకు చిక్కాయి. ముబిన్ చనిపోవడం, అంతకు ముందు కారులో పేలుడు పదార్థాలు తరలించిన మిగిలిన నలుగురి కోసం గాలించిన పోలీసులు అందరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో ఐదు మంది

పోలీసుల అదుపులో ఐదు మంది

ఓటుపట్టరై ప్రాంతంలో నివాసం ఉంటున్న మోహమ్మద్ తల్కా, మోహమ్మద్ అజారుద్దీన్, మోహమ్మద్ రియాజ్, ఫైరోజ్ ఇస్మాయిల్, మోహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్ అనే ఐదు మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దీపావళి బోనస్ గా పోలీసులకు మరో వ్యక్తి చిక్కిపోయాడు. సీసీటీవీ పుటేజీల దెబ్బతో మొత్తం మ్యాటర్ బయటకు వస్తుందని తెలిసింది.

మ్యాటర్ సీరియస్

మ్యాటర్ సీరియస్


పురాతన శివుడి ఆలయం ముందు ముబిన్ ప్రయాణించిన కారుల ఆగింది. కారు ఆగిన తరువాత పేలుడు జరిగిందని పోలీసులు అంటున్నారు. కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయా ? అని ఇప్పటికే రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ నిపుణులు ఆరా తీస్తున్నారు. స్వయంగా డీజీపీ రాజేంద్రన్ రంగంలోకి దిగి కేసు విచారణలో చేస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది.

ముబిన్ శవం భార్యకు అప్పగింత

ముబిన్ శవం భార్యకు అప్పగింత


కారు పేలుడులో చనిపోయిన ముబిన్ శవానికి ఐదు మంది వైద్యులు పోస్టుమార్టుం నిర్వహించారు. పోస్టుమార్టుం నిర్వహించే సమయంలో మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. ముబిన్ శవాన్ని అతని భార్య నస్రత్ కు అప్పగించారు. కోయంబత్తూరులోని వాడగోయిల స్మశానవాటికలో ముబిన్ అంత్యక్రియలు పూర్తి చేశారు.

English summary
Coimbatore: On the first day before the car cylinder exploded, it was recorded in the CCTV footage that 5 people were lifting a heavy object at midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X