మోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చిన్నారిని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని తిజారా నుంచి తిరిగి వస్తున్న సమయంలో హర్సోలి ముంద్వారా రోడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బైక్.. స్థానిక సర్పంచ్ ఛత్రమ్ యాదవ్‌దని గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాదవ్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ ప్రమాదంలో యాదవ్ మనవడు సచిన్(6) ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పుష్కర్‌లో జరిగిన మూడ్రోజుల ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశానికి మోహన్ భగవత్ వెళ్లారు.
35 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు చెందిన 200లకుపైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ జరిపిన తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. గత మే నెలలో కూడా మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు గాయపడ్డారు. రోడ్డు మధ్యలో ఉన్న ఆవును తప్పించబోయే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications