"కారు లేకపోతే పిల్లనివ్వరు"
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడం లేదన్నారు. బెంగళూరు ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ప్రతిపాదించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ ను సమర్థించుకుంటూ డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనకు బీజేపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. డీకే శివకుమార్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలని.. మాస్ ట్రాన్స్ పోర్ట్ ను విస్తరించాలని డిమాండ్ చేశారు. టన్నెల్ రోడ్డు అనేది సామాజిక సమస్యను రూపుమాపేది కానీ.. కారు లేని వారిని పెళ్లి చేసుకోని వాళ్లది కాదని కౌంటర్ ఇచ్చారు.
అంతకుముందు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై ఫైర్ అయ్యారు. ప్రజలు కార్లను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు..? దాని వెనక ఉన్న మర్మం ఏంటి..? అనేది తేజస్వి సూర్యకు అర్థం కావడం లేదన్నారు.
" నీ వాహనాన్ని రోడ్డుపై నడపకుండా నేను ఆపగలనా..? ఇది సామాజిక బాధ్యతకు సంబంధించిన అంశం. ప్రజలు తమ సొంత వాహనాల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు ఇష్టపడతారు. సొంత వాహనాల్లో ప్రయాణించకుండా వారిని ఆపగలమా..? ప్రస్తుత ఎంపీలు తమ నియోజకవర్గంలోని ప్రజల్ని.. సొంత వాహనాలు లేకుండా ప్రజా రవాణాలో వెళ్లండి అని చెప్పమనండి. ఎందమంది ప్రజలు అలా చేస్తారో చూద్దాం. ఈ రోజుల్లో కనీసం కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు" అని డీకే శివకుమార్ రిపోర్టర్స్ తో కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే డీకే శివకుమార్ వ్యాఖ్యలపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు." నేను ఇన్ని రోజులు టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ ను నిర్మించేది ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు అనుకున్నా. కానీ సామాజిక సమస్యను తీర్చేందుకు అని ఇప్పుడు అర్థమైంది. కారు లేదని పిల్లనివ్వని వారి సమస్యను తీర్చేందుకు అని ఇప్పుడు అర్థమైంది" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతకుముందు ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ.. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ ను నిలిపివేసి ప్రజా రవాణాపై దృష్టి సారించాలన్నారు. వాహనాలపై కాకుండా ప్రజలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాజెక్ట్ ను కోర్టులో సవాల్ చేయడమే కాకుండా.. నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications