ప్రకాష్ రాజ్‌పై కోర్టుకెక్కిన న్యాయవాది: ప్రధానిపై వ్యాఖ్యలకు కేసు నమోదు..
గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని మౌనాన్ని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ న్యాయవాది కోర్టుకెక్కారు.
లక్నో: నటుడు ప్రకాష్ రాజ్ మీద లక్నో కోర్టులో కేసు నమోదైంది. గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని మౌనాన్ని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ న్యాయవాది కోర్టుకెక్కారు.
ప్రధానిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విచారణ అక్టోబర్ 7న జరగనున్నట్లు సమాచారం.

కాగా, సోమవారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ప్రకాశ్‌రాజ్.. ప్రధాని వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్ హత్య విషయంలో మౌనం వహిస్తున్న ప్రధాని తన కన్నా పెద్ద నటుడు అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. లంకేష్ హత్యకు నిరసనగా తాను అందుకున్న జాతీయ అవార్డులను కూడా వెనక్కి ఇచ్చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
గౌరీ లంకేష్‌తో తనకు మూడు దశాబ్దాలుగా పరిచయం ఉందని, ఆమెను హత్యచేసిన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ప్రకాష్ రాజ్ విమర్శించారు. దీంతో ప్రకాష్ రాజ్ పై ఎదురుదాడి మొదలైంది.ప్రధానిపై వ్యాఖ్యలను తప్పు పడుతూ కొంతమంది ప్రకాష్ రాజ్‌ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications