సిట్టింగ్ సీఎంకు తిథి, మరోజన్మలో కూడా భమి మీద పుట్టకూడదు, కేసుల దెబ్బతో !
బెంగళూరు/చెన్నై: కావేరీ నదీజలాల (cauvery water) విషయంలో కర్ణాటక రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ కర్ణాటక జల సంరక్షణ పోరాట సమితి రామనగర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు మద్దతుగా వీధుల్లోకి వచ్చిక కన్నడ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నీటి విషయంలో చోద్యం చూస్తోందని ఆరోపించారు.
కావేరీ నదీ జలాల (cauvery water) నిర్వహణ కమిటీకి, తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసు శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 26వ తేదీన మంగళవారం రైతు సంఘాలు, కన్నడ సంఘాలు, జలసంరక్షణ కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగళూరు (Bengaluru), రామనగర జిల్లా బంద్ జరిగింది.

బంద్ నేపథ్యంలో రామనగర జిల్లాలోని పలు కన్నడ అనుకూల సంస్థలు, రైతు సంఘాలు, న్యాయవాదుల మీద కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. బంద్ కు మద్దతుగా నిరసన తెలిపిన కార్యకర్తల మీద పోలీసులు కేసులు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. రామనగర (Ramanagar) బంద్ సందర్భంగా జల సంరక్షణ పోరాట సమితి ఆద్వర్యంలో ఆందోళన జరిగింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమేష్ గౌడ ఆధ్వర్యంలో కస్తూరి కర్ణాటక జనపద కార్యకర్తలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (stalin) మొండి వైఖరి వల్లే కర్ణాటక రాష్ట్రంలో కావేరి నదీ (cauvery water) జలాల వివాదానికి కారణమని ఆరోపించారు. రామనగరలోని (Ramanagar)ఓల్డ్ బెంగళూరు మైసూరు జాతీయ రహదారిలోని ఐజూరు సర్కిల్ వద్ద కస్తూరి కర్ణాటక పీపుల్స్ ఫోరం తరపున వినూత్నంగాన నిరసన తెలిపారు.

తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ (stalin) ఆకస్మికంగా చనిపోయారని ఆరోపిస్తూ ఆయనకు తిథి పెట్టారు. చనిపోయిన (cauvery water) వారికి పెద్ద ఖర్మ చేసే పద్దతిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (stalin) చిత్రపటం ముందు పలు రకాల ఆహార పదార్థాలు ఉంచి పాలు, నెయ్యి రోడ్డు మీద వదిలారు. కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నీటి కష్టాలకు కారణమైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (stalin) మళ్లీ ఈ భూమి మీద పుట్టకూడదంటూ నినాదాలు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్‌ను (stalin)హేళన చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులపై రామనగరలోని (Ramanagar)ఐజూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కస్తూరి కర్ణాటక పీపుల్స్ ఫోరం కార్యకర్తలు, ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమేష్ గౌడపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌గౌడ్‌తో పాటు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ వారిపై పలు సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications