పోలింగ్ రోజు ఓటర్లకు డబ్బులు ఎర: రూ.4.8 కోట్లు సీజ్: బీజేపీ అభ్యర్థిపై ఎఫ్ఐఆర్

Lok Sabha elections 2024: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ముమ్మరంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.

ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. జోరుగా సాగుతోంది.

Cash seized worth 4 8 Crores and booked BJP Candidate K Sudhakar

కాగా- ఈ పరిణామాల మధ్య కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి డాక్టర్ కే సుధాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజన ఓటర్లను డబ్బులు పంచి పెట్టడానికి ఆయన ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

పోలింగ్ రోజున 4.8 కోట్ల రూపాయల నగదును కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం కూడా కే సుధాకర్‌కు చెందినవిగా భావిస్తోన్నారు. ఈ నగదు మొత్తం ఆయనదేనని తేలడంతో కేసు నమోదు చేశారు. ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 123, 171 కింద మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయింది.

ఈ ఎన్నికల్లో కే సుధాకర్.. చిక్‌బళ్లాపుర లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన సొంత నియోజకవర్గం చిక్‌బళ్లాపుర. ఇదివరకు ఇదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+