నోట్ల రద్దు ఎఫెక్ట్: నగదు లావాదేవీలే అధికం, డిజిటల్ పేమెంట్ల పెరుగుదల స్వల్పమే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్ పేమెంట్ల వైపు ఎక్కువగా కేంద్రం ప్రయత్నాలు చేసినప్పటికీ అనుకొన్నంతగా ఆ వైపుకు ప్రజలు మళ్ళలేదు. డిజిటల్ పేమెంట్ల కంటే గతంలో మాదిరిగానే నగదు లావాదేవీలే ఎక్కువగా కొనసాగుతున్నాయి.

  PM Modi's Notes Ban After A Year : What's Changed

  నోట్ల రద్దు ఎఫెక్ట్: బ్యాంకుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లు

  గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది. నల్లధనం నిర్మూలించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొంది.
  అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

  నోట్ట రద్దు ఎఫెక్ట్: 1.5 మిలియన్ ఉద్యోగాల్లో కోత

  కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తోంది. పెద్ద నగదు నోట్ల రద్దు సమయంలో డిజిటల్ పేమెంట్లను కేంద్ర ప్రోత్సహించింది. ఈ మేరకు డిజిటల్ పేమెంట్లు చేస్తే వారికి ప్రోత్సాహకాలను కూడ ప్రకటించింది.

  నగదు లావాదేవీలే అధికం

  నగదు లావాదేవీలే అధికం

  నగదు లావాదేవీల కంటే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పెద్ద నగదు నోట్ల రద్దు సమయంలో మార్కెట్లో అనుకొన్న మేరకు డబ్బు అందుబాటులో లేకపోవడంతో డిజిటల్ పేమెంట్ల వైపు ప్రజలు మొగ్గు చూపారు. కానీ, మార్కెట్లో డబ్బు అనుకొన్న మేరకు అందుబాటులోకి రావడంతో డిజిటల్ పేమెంట్లు ఆశించిన మేర జరగడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

   నగదు రహిత లావాదేవీలు నత్తనడక

  నగదు రహిత లావాదేవీలు నత్తనడక

  నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు పెద్దనోట్ల రద్దును చేపట్టామని పాలకులు ప్రకటించారు. డిజిటల్ పేమెంట్లు చేస్తే ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ మేరకు కొందరికి బహుమతులు కూడ లభించాయి. కానీ పెద్దనోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్నా.. ఇప్పటికీ నగదురహిత లావాదేవీలు నత్తనడకనే సాగుతున్నాయి. ఆర్బీఐ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నగదురహిత లావాదేవీల్లో కీలకమైన వ్యాలెట్లు, నాన్‌ యూపీఐ బ్యాంకింగ్‌ యాప్‌లు, ఆధార్‌ సహిత చెల్లింపులు అనుకున్నంతగా ఊపందుకోలేదు. మరోవైపు డెబిట్‌కార్డు లావాదేవీలు గణనీయంగా పడిపోయాయని ఆర్‌బిఐ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

   మొబైల్ ఫోన్ల ద్వారానే చెల్లింపులు

  మొబైల్ ఫోన్ల ద్వారానే చెల్లింపులు

  పెద్దనోట్ల రద్దు తర్వాత యూపీఐ చెల్లింపులు పెరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపుల్లో మొబైల్‌ ఫోన్ల ఆధారంగా జరుగుతున్న లావాదేవీలే అధికంగా ఉన్నాయి.

  మొత్తంగా డిజిటల్‌ ఎలక్ట్రానిక్‌ చెల్లింపులు ఈ ఏడాది ఆగస్టు నెలలో రూ. 200 ట్రిలియన్లకు చేరాయి. 2016 ఆగస్టుతో పోలిస్తే 5 శాతం పెరుగుదల నమోదైంది. అయితే, పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉన్న గత డిసెంబర్‌ రూ. 201 ట్రిలియన్లతో పోలిస్తే 0.7శాతం డిజిటల్‌ చెల్లింపులు తగ్గాయి.

   తగ్గిన డిజిటల్ పేమెంట్లు

  తగ్గిన డిజిటల్ పేమెంట్లు

  పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు గతం కంటే తగ్గిపోయాయి. ముఖ్యంగా మొబైల్‌ బ్యాంకింగ్‌ గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే 30శాతానికి పడిపోయింది. పెద్దనోట్ల రద్దు తీవ్రంగా ఉన్న కాలంతో పోల్చుకుంటే 46శాతానికి పడిపోయింది. ఇక డెబిట్‌ కార్డు చెల్లింపులు కూడా తగ్గిపోయాయి. గత ఏడాది అక్టోబర్‌లో డెబిట్‌ కార్డు చెల్లింపులు రూ. 2,767 బిలియన్లు కాగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 2.2శాతం తగ్గి రూ. 2,706 బిలియన్లకు చేరుకున్నాయి. అయితే, డెబిట్‌ కార్డు లావాదేవీలుమాత్రం నాలుగు శాతం పెరిగాయి.

   మొబైల్ బ్యాంకింగ్ వాటా పెరుగుదల స్వల్పమే

  మొబైల్ బ్యాంకింగ్ వాటా పెరుగుదల స్వల్పమే

  పెద్దనోట్ల రద్దు వల్ల మొబైల్‌ బ్యాంకింగ్‌, వ్యాలెట్‌ సేవలు స్వల్పంగా పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మొబైల్‌ బ్యాంకింగ్‌ వాటా 0.33శాతమే. అంటేరూ. 799.13 బిలియన్లు మాత్రమే. పేటీఎం, మొబిక్విక్‌, బ్యాంకింగ్‌ వ్యాలెట్లు మొబైల్‌ వ్యాలెట్ల ద్వారా జరుగుతున్న చెల్లింపులు కూడా స్వల్పంగానే ఉన్నాయి. మొత్తం ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మొబైల్‌ వ్యాలెట్ల వాటా కేవలం 0.051శాతమే . అంటే రూ. 102.88 బిలియన్లు మాత్రమే.

   10 శాతం నగదు తక్కువగా చలామణి

  10 శాతం నగదు తక్కువగా చలామణి

  మొత్తానికి పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా నగదు లావాదేవీలు గణనీయంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రజలు ఇప్పటికీ నగదు కోసం ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న నగదు కన్నా పదిశాతం తక్కువ నగదు ప్రస్తుతం చెలామణిలో ఉంది. అయినా, నగదు లావాదేవీలకే ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  If demonetisation was a push for a cashless economy, it has been working very slowly. Reserve Bank of India data shows the usage of wallets, non-UPI banking apps and Aadhaar-enabled payments has been slow to catch on, while that of debit cards has fallen. The UPI payments have been growing, and a significant chunk of them are mobile-based.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి