రైల్వే పార్శిల్ కార్యాలయంలో హెడ్ క్లర్కు రాసక్రీడలు, సీసీటీవీ రికార్డయిన దృశ్యాలు
రైల్వే పార్శిల్ కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్న హెడ్ క్లర్కు ఓ యువతితో రాసక్రీడలు సాగించిన బాగోతం సీసీటీవీ ఫుటేజ్‌లో వెలుగుచూసింది. ఈ ఉదంతం ముంబై నగరంలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌లో జరిగింది.
Recommended Video

ముంబై : రైల్వే పార్శిల్ కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్న హెడ్ క్లర్కు ఓ యువతితో రాసక్రీడలు సాగించిన బాగోతం సీసీటీవీ ఫుటేజ్‌లో వెలుగుచూసింది. ఈ ఉదంతం ముంబై నగరంలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌లో జరిగింది.
రైల్వే కార్యాలయాల్లో సాగుతున్న అక్రమాలను బయటపెట్టేందుకు గాను సమాచార హక్కు చట్టం కార్యకర్త సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ లో రైల్వే ఉద్యోగి సాగించిన ఈ రాసక్రీడలు వెలుగుచూశాయి.
లోకమాన్య తిలక్ టెర్మినల్ పార్శిల్ విభాగంలో రాత్రివేళ విధినిర్వహణలో ఉన్న రైల్వే హెడ్ క్లర్కు అజయ్ బోస్ బార్ లో పనిచేస్తున్న ఓ అర్కెస్టా యువతితో సన్నిహితంగా మెలగడం సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డయింది.

90 నిమిషాల నిడివి గల ఈ సీసీటీవీ ఫుటేజ్ లో యువతి చేతులు పట్టుకొని చెట్టాపట్టాలేసుకోవడం, పక్క పక్కన కూర్చొని భోజనం చేయడం, యువతి పడుకోవడం నుంచి దుస్తులు మార్చుకోవడం దాకా అంతా రికార్డయింది.
ఆ యువతిని తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవరు కూడా క్లర్కు బెంచీపై పడుకోవడం కూడా వీడియోలో కనిపించింది. విధినిర్వహణలో యువతితో ఇలా రాసక్రీడలు సాగించడంపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజరు రవీందర్ గోయల్ చెప్పారు.
తనకు తెలిసిన యువతి ఢిల్లీ వెళ్లేందుకు విమానం మిస్ అవడంతో రైలులో వెళ్లేందుకు వచ్చిందని సురక్షితంగా ఉంటుందని తన కార్యాలయంలో కూర్చోబెట్టానని రైల్వే ఉద్యోగి చెబుతున్నాడు. మొత్తం మీద సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగుచూసిన రైల్వే ఉద్యోగి రాసక్రీడల బాగోతం సెంట్రల్ రైల్వేలో సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications