రాజ్‌నాథ్ సింగ్ సీరియస్‌గా మాట్లాడుతుంటే రంజిత్ సిన్హా కునుకు

గౌహతి: సిబిఐ చీప్ రంజిత్ సిన్హా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనను వివాదం వెంట వివాదం వెంటాడుతోంది. అంతర్గత భద్రతపై అసోం రాజధాని గౌహతిలో కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో సిబిఐ డైరెక్టర్ సిన్హా హాయిగా కునుకు తీస్తూ కనిపించారు. కొద్ది రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. శనివారంనాడు ఈ సమావేశం జరిగింది.

2జి కుంభకోణం దర్యాప్తునకు దూరంగా ఉండాలని రంజీత్ సిన్హాను సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో నిందితుడికి సహాయపడడానికి ప్రయత్నించాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. 2జి కుంభకోణం కేసు దర్యాప్తు నుంచి తప్పుకోవాలని రంజిత్ సిన్హాను సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. రంజిత్ సిన్హాపై ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రంజిత్ సిన్హా చర్యలు సిబిఐ ప్రతిష్టను పెంచేలా లేదని అభిప్రాయపడింది. 2జి కుంభకోణం దర్యాప్తులో రంజిత్ సిన్హా ఇంకెంత మాత్రం జోక్యం చేసుకోకూడదని తేల్చి చెప్పింది.

CBI chief Ranjit Sinha appears to be napping during Rajnath Singh's speech

తన కింది స్థాయి ఉద్యోగి రస్తోగిని కావాలనే దర్యాప్తు నుంచి రంజిత్ సిన్హా తప్పించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2జి స్కామ్ దర్యాప్తులో వేలు పెట్టవద్దని సుప్రీంకోర్టు రంజిత్ సిన్హాను ఆదేశించింది. అంతా సజావుగా సాగుతున్నట్లు తమకు అనిపించడం లేదని చెప్పింది. దర్యాప్తును సిబిఐ ఉన్నతాధికారికి అప్పగించాలని సూచించింది.

తమ సంస్థలో డీఐజీ ర్యాంకు సీనియర్‌ అధికారి సంతోష్ రస్తోగి తనపై కోవర్ట్‌ వ్యవహారాలు నడిపినట్లు సిబిఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా బుధవారంనాడు సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తనపై అబద్ధపు-నిరాధార ఆరోపణలు చేయడానికి వీలుకల్పించేలా కొన్ని పత్రాలను అందజేసిందని ఆయనేనని ఆరోపించారు. చీఫ్‌ జస్టిస్‌ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ సందర్భంగా ఆయన ఈ మేరకు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+