2గ.లపాటు నరసింహన్ విచారణ: రాజీనామా చేస్తారా?

 CBI to question Narasimhan
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు బుధవారం తీసుకున్నారు. గవర్నర్‌ను రెండు గంటల పాటు విచారించారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కొనుగోలు, ఒప్పందాలు, సమీక్షలు, నిర్ణయాల పైన నరసింహన్ నుండి వాంగ్మూలం తీసుకున్నారు. 161 స్టేట్‌మెంట్ కింద ఆయన వాంగ్మూలం తీసుకున్నారు.

అంతకుముందు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు బుధవారం రాజ్ భవన్‌కు చేరుకున్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో నలుగురు సీబీఐ అధికారులు నరసింహన్‌ను సాక్షిగా ప్రశ్నించేందుకు చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారమే ఆయనను ప్రశ్నించారు.

కాగా, ఆగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కున్న ఇద్దరు గవర్నర్లు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను ఎదుర్కోనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా రాజీనామా చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణం కేసులో సాక్షులుగా విచారణను ఎదుర్కున్న తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఎంకె నారాయణన్, గోవా గవర్నర్‌గా బివి వాంచూ రాజీనామాలు చేశారు. గత వారం సిబిఐ అధికారులు వారిద్దరినీ విచారించారు.

ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను బుధవారం సిబిఐ అధికారులు విచారించేందుకు రాజ్ భవన్‌కు వచ్చారు. నరసింహన్‌ను కూడా సిబిఐ అధికారులు సాక్షిగా విచారిస్తున్నారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం సంబంధించి అధికారులు సాంకేతికపరమైన వివరాలు తీసుకున్న సమయంలో నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా ఉన్నారు. నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అలాగే బీవీ వాంచూ స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ హెడ్‌గా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+