ఆ బ్యాంకులో 266 కోట్ల నగదు స్వాధీనం, ఆ డబ్బు ఎవరిది ?

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కేరళలోని మల్లాపురం కోఆపరేటివ్ బ్యాంకులో నవంబర్ 8 నుండి 10వ, తేది వరకు సుమారు 266 కోట్ల నగదు డిపాజిట్ అయింది.

కేరళ :కేరళలోని మల్లాపురం కోఆపరేటివ్ బ్యాంకుల్లో సిబిఐ అధికారులు దాడులు చేసి 266 కోట్ల రూపాయాలను స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా బ్యాంకులో భారీగా నగదును డిపాజిట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు అక్రమార్కులు అనేక వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. బ్యాంకుల సహయంతో పెద్ద ఎత్తున నల్లధనాన్ని మార్పిడి చేసుకొంటున్నారు. అక్రమార్కులకు బ్యాంకు అధికారులు కూడ సహకారాన్ని అందిస్తున్నారు.

cbi raids malappuram district co-op bank, rs 266 crore seized

పెద్ద నగదు రద్దుచేసిన నవంబర్ 8వ, తర్వాత ఈ ఎలాంటి ఆధారాలు లేకుండానే పెద్ద ఎత్తున నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన విషయాన్ని గుర్తించిన సిబిఐ అదికారులు దాడులు నిర్వహించారు. కేరళలోని మల్లాపురం కోఆపరేటివ్ బ్యాంకులో సిబిఐ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎలాంటి ఆధారాలు లేని నగదును డిపాజిట్ చేసుకొన్న విషయాన్ని సిబిఐ అధికారులు గుర్తించారు.

నవంబర్ 8వ, తేది నుండి నవంబర్ 14 వ, తేది వరకు ఈ నగదు కో ఆపరేటివ్ బ్యాంకులో 266 కోట్లను డిపాజిట్ చేసినట్టు గుర్తించారు.ఈ నడుదకు సంబంధించి ఎలాంటి ఆధారాలు మాత్రం చూపలేదు. ఆర్ బి ఐ నిబంధనలను ఉల్లంఘించి బ్యాంకు అధికారులు నగదును డిపాజిట్ చేశారని సిబిఐ అధికారులు గుర్తించారు.

కొందరు ప్రముఖులు , రాజకీయనాయకులు బ్యాంకుల్లో ఉన్న లోసుగుల ఆధారంగా ఈ నగదును డిపాజిట్ చేశారనే ఆరోపణలు కూడ వచ్చాయి.ఈ ఆరోపణలపై పూర్తి నిర్ధారణ ఇంకా కాలేదు. ఈ నగదు ఎవరిదనే విషయాన్ని సిబిఐ అధికారులు తేల్చే పనిలో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+