పీఎన్బీ స్కాం: కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సీబీఐ
Recommended Video

న్యూఢిల్లీ: సుమారు 12 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసుకు సంబంధించి సీబీఐ గురువారం పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది. లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్(ఎల్‌ఓయూ) ద్వారా నీరవ్ పలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఎల్‌ఓయూలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై వడలా ప్రాంతంలోని ఓ చిన్న గదిలో ఆ పత్రాలను దాచినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరికొంతమంది అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

కాగా, నీరవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన మూడు డిపాజిట్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. దుబాయ్, బహ్రెయిన్, అంట్వెర్ప్(బెల్జియం) ప్రాంతాల్లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ల్లో ఉన్న నీరవ్ ఖాతాలను నిలిపివేశారు.
దాదాపు రూ.12వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసి నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ, ఈడీ అధికారులు ఆయనకు ఈమెయిల్ పంపించారు. కానీ విదేశాల్లో వ్యాపారాలు చేయడంలో బిజీగా ఉన్నానని.. విచారణకు హాజరు కాలేనని నీరవ్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications