కార్తీకి 15 రోజుల రిమాండ్, లండన్ నుంచి హడావుడిగా చిదంబరం తిరుగు పయనం
చెన్నై/న్యూఢిల్లీ: మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ అధికారులు బుధవారం పాటియాలా కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆయనకు న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది.
ఐఎన్ఎక్స్ మీడియాలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కార్తీ చిదంబరాన్ని పదిహేను రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. న్యాయస్థానం కార్తీకి రిమాండు విధించింది.

మరోవైపు, విచారణ సందర్భంగా కార్తీ సహకరించడం లేదని సీబీఐ చెప్పింది. తన అరెస్టు రాజకీయ కుట్ర అని కార్తీ చిదంబరం అన్నారు. ఐఎన్ఎక్స్ కేసు విచారణకు తాను సహకరిస్తున్నానని తెలిపారు.
మరోవైపు, లండన్ పర్యటనలో ఉన్న కార్తీ తండ్రి చిదంబరం అర్ధాంతరంగా తిరిగి వస్తున్నారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ డిబేట్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. విషయం తెలిసి తిరుగు పయనం అయ్యారు.












Click it and Unblock the Notifications