వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE : సీబీఎస్ఈ పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు విడుదల... ఇలా చెక్ చేసుకోండి...

|
Google Oneindia TeluguNews

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 56.55 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,57,866 మంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా... 1,49,726 మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజరయ్యారు. ఇందులో 82,903 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సీబీఎస్ఈ పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్ cbse.nic.inలో చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి...

మొదట సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌ cbse.nic.in సందర్శించండి
రిజల్ట్ ఆప్షన్‌ లింక్‌పై క్లిక్ చేయాలి
మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి
స్క్రీన్‌పై మీ ఫలితాలు కనిపిస్తాయి
ఆ మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవాలి.

CBSE 10th compartment results 2020 declared, here you can check

ఈ ఏడాది జులైలో సీబీఎస్ఈ పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పరీక్షల్లో మొత్తం 91.46శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా 2.23శాతం మంది 95శాతం కంటే ఎక్కువ మార్కులు సంపాదించారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైనవారి కోసం సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు కంపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించారు.

ఈ ఏడాది మొత్తం 18లక్షల మంది సీబీఎస్ఈ వార్షిక పరీక్షలు రాశారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా పరీక్షలు మధ్యలోనే రద్దయ్యాయి. దీంతో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. అయితే ఇలా ప్రత్యామ్నాయ పద్దతి కారణంగా ఎక్కువమంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

English summary
CBSE 10th compartment exam results 2020: Central Board of Secondary Education (CBSE) on Monday declared the results class 10th compartment examination on its official website. A total of 56.55% students passed the compartment exam this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X