వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CCTV: ఎస్ఐ నైట్ డ్యూటీ, రోడ్డు పక్కన ఏం చేశాడంటే ?, చరిత్రలో నిలిచిపోయాడు, సీసీటీవీల్లో, దేవుడా !

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం/కేరళ: చోరీలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. చోరీలు చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించడం సర్వసాదారణంగా జరుగుతుంది. వీధి వ్యాపారాలు చేసుకునేవాళ్లు పోలీసులు వెళితే తక్కువ ధరకు వాళ్లు అమ్మే వస్తులు ఇవ్వడం, రోజువారి మామూళ్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాము. అర్దరాత్రి ఫుట్ పాత్ మీద ఉన్న మామిడి పండ్లు చోరీ అయ్యాయని గుర్తించిన వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ పుటేజ్ లు పరిశీలించిన పోలీసులు బిత్తరపోయారు. మామిడి పండ్లు చోరీ చేసి దర్జాగా వెళ్లిపోయింది ఎస్ఐ అని తెలుసుకున్న జిల్లా ఎస్పీతో సహ సాటి పోలీసు అధికారులు షాక్ అయ్యారు. ఎస్ఐ చెయ్యరాని పని చేసి పోలీసుల చరిత్రలో నిలిచిపోయాడు.

Crime: బెంగళూరులో భర్త, బడిలో కూతురు, ఒడిలో ప్రియుడు, ఏం నాటకాలు ఆడిందిరా సామి, క్లైమాక్స్ !Crime: బెంగళూరులో భర్త, బడిలో కూతురు, ఒడిలో ప్రియుడు, ఏం నాటకాలు ఆడిందిరా సామి, క్లైమాక్స్ !

మామూళ్లు ఇస్తున్న వీధి వ్యాపారులు

మామూళ్లు ఇస్తున్న వీధి వ్యాపారులు


దేశంలోని అనేక రాష్ట్రాల్లో వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్లు పోలీసులకు మామూళ్లు ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీధిలో వ్యాపారం చేసుకోకుండా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటారనే భయంతో వీధి వ్యాపారులు పోలీసులకు ప్రతినిత్యం సాయంత్రం పూట లంచం సమర్పించుకుంటున్నారు.

 ఆసుపత్రి దగ్గర వ్యాపారం

ఆసుపత్రి దగ్గర వ్యాపారం

కేరళలోని కొట్టాయంలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని ఫుట్ పాత్ ల మీద పండ్లు, కొబ్బరి బొండాలు విక్రయిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో ఉన్న రొగులకు అందుబాటులో ఉండాలని పండ్లు విక్రయిస్తున్నారు.

నైట్ డ్యూటీ చేస్తున్న ఎస్ఐ

నైట్ డ్యూటీ చేస్తున్న ఎస్ఐ

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన షికాబ్ (38) ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. మూడు వారాల నుంచి కొట్టాయంలో ఎస్ఐ షికాబ్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి 9 గంటలకు డ్యూటీకి వెలుతున్న ఎస్ఐ షికాబ్ మరుసటి రోజు వేకువ జామున 5 గంటల వరకు గస్తీ తిరగడం, కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలు చూసుకోవడం చేస్తున్నాడు.

మామిడి పండ్ల వాసనకు తట్టుకోలేకపోయాడు

మామిడి పండ్ల వాసనకు తట్టుకోలేకపోయాడు

సెప్టెంబర్ 30వ తేదీన ఎస్ఐ షికాబ్ నైట్ డ్యూటీకి వెళ్లాడు. వేకువ జామున 4 గంటల సమయంలో కొట్టాయం ప్రభుత్వ ఆసుపత్రిలో రౌండ్స ముగించుకున్న ఎస్ఐ షికాబ్ తరువాత బైక్ లో ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో బరదూచోటు ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద మామిడి పండల్ల వాసన జోరుగా రావడంతో ఎస్ఐ షికాబ్ ముక్కు తట్టుకోలేకపోయింది.

ఒకటి కాదు... ఏకంగా 10 కేజీల మామిడి పండ్లు చోరీ

ఒకటి కాదు... ఏకంగా 10 కేజీల మామిడి పండ్లు చోరీ

బైక్ నిలిపిన ఎస్ఐ షికాబ్ నేరుగా ఫుట పాత్ మీద ఉన్న మామిడి పండ్ల బాక్స్ లు తీశాడు. పెద్దపెద్ద మామడి పండ్లు ఏరుకుని బ్యాగ్ లో వేసుకున్నాడు. ఏదో కొన్ని మామిడి పండ్లు తీసుకోకుండా ఏకంగా 10 కేజీలకు పైగా మామిడి పండ్లు చోరీ చేసిన ఎస్ఐ షికాబ్ బైక్ లో దర్జాగా ఇంటికి వెళ్లిపోయాడు.

 కేసు పెట్టిన వ్యాపారులు

కేసు పెట్టిన వ్యాపారులు

మరుసటి రోజు ఉదయం వ్యాపారం చెయ్యడానికి వెళ్లిన వ్యాపారి మామిడి పండ్లు చోరీ అయిన విషయం గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు రాత్రి వ్యాపారం ముగించుకున్న తరువాత పండ్లు ఉన్న బాక్స్ లు ఫుట్ పాత్ మీద పెట్టి వెళ్లిపోతామని, ఎప్పుడు చోరీ జరగలేదని, ఇప్పుడు చోరీ జరిగిందని వ్యాపారి పోలీసులకు చెప్పాడు.

 సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయిన ఎస్ఐ

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోయిన ఎస్ఐ

పోలీసులు రంగంలోకి దిగి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ పుటేజ్ లు పరిశీలించిన పోలీసులు బిత్తరపోయారు. మామిడికాయలు చోరీ చేసి దర్జాగా వెళ్లిపోయింది ఎస్ఐ షికాబ్ అని తెలుసుకున్న పోలీసులు హడలిపోయి ఏం చెయ్యాలో తెలీక జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు.

ఎస్ఐ అడిగితే ఎంతైనా ఇచ్చేవాళ్లు కదా ?

ఎస్ఐ అడిగితే ఎంతైనా ఇచ్చేవాళ్లు కదా ?

ఎస్ఐ షికాబ్ మామిడి పండ్లు చోరీ చేసిన కేసు కొన్ని రోజులు బయటకురాకుండా చూశారు. అయితే ఎస్ఐ షికాబ్ మామిడి పండ్లు చోరీ చేస్తున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ క్లిప్లింగ్స్ వైరల్ కావడంతో పోలీసు అధికారులు హడలిపోయారు. ఎస్ఐ షికాబ్ ను సస్సెండ్ చేసిన కొట్టాయం జిల్లా ఎస్పీ ఆయన మీద చోరీ కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

 ఎస్ఐకి ఏం పోయేకాలం వచ్చిందో ?

ఎస్ఐకి ఏం పోయేకాలం వచ్చిందో ?

ఎస్ఐ అడిగితే వేల రూపాయలు లంచం ఇవ్వడానికి సిద్దంగా ఉండే ప్రజలు మామిడి పండ్లు అడిగితే ఇవ్వరా ?, డబ్బులు పెట్టి కొనుక్కునే స్థోమత ఎస్ఐకి లేదా అని సామాన్య ప్రజలు అంటున్నారు. మొత్తం మీద చోరీ కేసులో ఎస్ఐ మీద కేసు నమోదు కావడం కేరళలో కలకలం రేపింది.

English summary
CCTV: Police sub inspector in Kerala was suspended after he was found stealing 10 kg mangoes. He was also booked for this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X