CD Girl: మాజీ మంత్రి రాసలీలల కేసు, వాళ్లకు మందస్తు బెయిల్ మంజూరు, ఏం చెబుతారో ? టెన్షన్ !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, పీజీ సుందరి రాసలీలల కేసు వ్యవహారంలో బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి, సీడీ గర్ల్ రాసలీలల సీడీ బయటకు వచ్చినప్పటి నుంచి మాయం అయిన నిందితులు ఇద్దరికి కోర్టు షరులతో బెయిల్ మంజూరు చెయ్యడంతో కేసు విచారణ రసవత్తరంగా మారింది. బెయిల్ రావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్ఐటీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. సిట్ అధికారుల ముందు ఆ ఇద్దరు ఏమి స్టేట్ మ్మెంట్ ఇస్తారో ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

పీజీ సుందరి రాసలీలల యవ్యారం
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి, బెంగళూరులోని ఆర్ టీ నగర్ పీజీ సుందరి రాసలీలల సీడీ బయటకు రావడం కలకలం రేపింది. రాసలీలల సీడీ వ్యవహారం బయటకు వచ్చిన తరువాత రమేప్ జారకి హోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని తన జీవితనం నాశనం చేశాడని పీజీ సుందరి రమేష్ జారకిహోళి మీద కేసు పెట్టింది.

రివర్స్ కేసు+ బ్లాక్ మెయిల్ చేశారని ?
పీజీ సుందరితో పాటు నరేష్ గౌడ, శ్రావణ్ కుమార్ అనే ఇద్దరు తనను భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేదంటే తన పరువు బజారుకు ఈడుస్తామని బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి రమేష్ జారకిహోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్లాక్ మెయిల్ కేసు నమోదు అయిన వెంటనే శ్రావణ్ కుమార్, నరేష్ గౌడ పరారైనారు.

ముందుస్తు బెయిల్
ప్రస్తుతం పోలీసులకు కనపడకుండా తప్పించుకుని తరుగుతున్న శ్రావణ్ కుమార్, నరేష్ కుమార్తె ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు 91వ సిటి సివిల్ కోర్టు న్యాయస్థానం బ్లాక్ మెయిల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేష్ గౌడ, శ్రావణ్ కుమార్ లకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

ఎస్ఐటీ అధికారులు ముందు ?
ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో శ్రావణ్ కుమార్, నరేష్ గౌడ ఇప్పుడు కచ్చితం ఎస్ఐటీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంటుంది. మాజీ మంత్రి రమేష్ జారకిహోళి పెట్టిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు ఎస్ఐటీ అధికారుల ముందు ఏమి స్టేట్ మ్మెంట్ ఇస్తారో ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications