ఆ సినిమా మర్చిపోలేని అనుభూతి: సమంత సినిమా రిలీజ్ వేళ.. నాగ చైతన్య రివ్యూ వైరల్..!!
టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఇలా చాలా ఉంటాయి. అయితే ఈ వారం కూడా తెలుగులో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం ఒకటి. బీవీ. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్ల వద్ద ఈ మూవీ దూసుకెళ్తోంది.
అలాగే మలయాళం నుంచి బాలన్: ది బాయ్ అనే మూవీ కూడా ఇదే రోజున రిలీజ్ అయింది. మోస్ట్ అవేటెడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ బాలన్: ది బాయ్ కోసం మలయాళీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కారణం మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ దర్శకుడు చిదంబరం నుంచి వస్తున్న మూవీ కావడమే..

ఇక ఈ బాలన్ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో రిలీజ్ చేసింది. అయితే సమంత సినిమాతో అక్కినేని వారి సంస్థ పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మూవీపై టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య ఇచ్చిన రివ్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ ఫీల్ లోనే ఉండిపోయానని, బాలన్: ది బాయ్ సినిమా మర్చిపోలేని అనుభూతికి గురిచేసిందని అన్నారు. నిజం చెప్పాలంటే సినిమా చూసి బయటకు వచ్చినా కూడా అది నన్ను వదిలిపెట్టడం లేదని తెలిపారు.
మొదట తాను.. ఇదొక తల్లీకొడుకుల సెంటిమెంట్ డ్రామా అనుకున్నానని.. ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిందని.. కానీ మొదటి 10 -15 నిమిషాల తర్వాత కథ అస్సలు ఊహించని మలుపు తిరిగిందని అన్నారు. అక్కడి నుంచి సినిమా ఏ రేంజ్ లో ట్రాక్ మార్చిందో నేను అస్సలు ఊహించలేదని నాగ చైతన్య తెలిపారు. ఇక నాగ చైతన్య ప్రశంసలతో మూవీ లవర్స్ లో ఈ సినిమాపై బజ్ మరింత పెరిగింది.












Click it and Unblock the Notifications