vastu tips: ఆర్థిక కష్టాలకు పటికతో చెక్! అదృష్టం మీ సొంతం

ఇంట్లో నిరంతరం గొడవలు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, మానసిక అశాంతి.. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని ప్రతికూల శక్తుల ప్రభావం వల్లే ఇలా జరుగుతుంటుంది. అయితే, మన వంటింట్లో లేదా పూజా గదిలో సులభంగా దొరికే పటికతో ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నీటిని శుభ్రం చేయడానికి వాడే పటికకు, ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని పీల్చేసుకునే అద్భుత శక్తి ఉంది. పటికతో పాటించాల్సిన కొన్ని సులభమైన వాస్తు చిట్కాలు తెలుసుకుందాం.

దిష్టి దోషాలు, చెడు శక్తులు రాకుండా

శనివారం రోజున ఒక చిన్న పటిక ముక్కను నల్లటి వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం బయట వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల నరఘోష, దిష్టి ప్రభావం తొలగిపోవడమే కాకుండా, ఎలాంటి చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు.

Vastu tips Put an end to financial troubles with alum Good fortune will be yours

ఇల్లు తుడిచే నీటిలో

వారంలో కనీసం గురువారం లేదా శనివారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పటిక పొడిని కలపాలి. ఈ నీటితో ఇల్లు శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం, ప్రశాంతత పెరుగుతాయి.

పీడకలలు, మానసిక ఒత్తిడి దూరం కావడానికి

రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం, తరచూ పీడకలలు రావడం లేదా భయాందోళనలతో బాధపడేవారు ఒక చిన్న పటిక ముక్కను నల్లటి బట్టలో చుట్టి దిండు కింద పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం దాన్ని ప్రవహించే నీటిలో పారేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా పటిక వేసుకుని స్నానం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి శరీరం తాజాగా మారుతుంది.

వ్యాపార వృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం

ఆఫీస్ లేదా వ్యాపార సంస్థల్లో నిలిచిపోయిన పనులు సాఫీగా సాగాలన్నా, లాభాలు రావాలన్నా నల్లటి వస్త్రంలో చుట్టిన పటికను ఆఫీస్ క్యాబిన్ లేదా క్యాష్ బాక్స్‌లో ఉంచాలి. ఇది కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూలు లేదా డీల్స్ కోసం వెళ్లేటప్పుడు చిన్న పటిక ముక్కను జేబులో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుంది.

వాస్తు దోషాల నివారణకు

ఇంటి నిర్మాణంలో ఏవైనా వాస్తు లోపాలు ఉంటే.. ఇంటి నాలుగు మూలల్లో చిన్న చిన్న పటిక ముక్కలను ఉంచాలి. ఇది ఆయా మూలల నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీని తొలగించి, ఇల్లంతా సానుకూల శక్తి ప్రసరించేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+