డబ్బులిచ్చి మరీ కరోనా ప్రయోగాలు.. వైరస్ లీక్‌పై బయటపడ్డ అసలు నిజాలు!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మూలాలకు సంబంధించి అమెరికా రాజకీయాల్లో మరోసారి పెనుసంచలనం రేగింది. జో బైడెన్ ప్రభుత్వంలోని మాజీ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ.. చైనాలోని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు నిధులు సమకూర్చారని అమెరికా మాజీ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ గురువారం సంచలన పత్రాలను విడుదల చేశారు. తన పదవీకాలం చివరి రోజు ఆమె ఈ రహస్య పత్రాలను బహిర్గతం చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమైన ల్యాబ్‌కు అమెరికా పన్నుల రూపంలో వచ్చిన మిలియన్ల కొద్దీ డాలర్లను ఆంథోనీ ఫౌచీ డైవర్ట్ చేశారని తులసి గబ్బార్డ్ ఆరోపించారు.

తులసి గబ్బార్డ్ ఆఫీస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. గబ్బార్డ్ విడుదల చేసిన పత్రాలు అంతకుముందెన్నడూ బయటపడలేదని తెలుస్తోంది. 'గెయిన్-ఆఫ్-ఫంక్షన్'(వైరస్‌ల తీవ్రతను పెంచే ప్రమాదకరమైన పరిశోధనలు) పేరుతో కరోనా వైరస్‌లపై ప్రయోగాలు చేయడానికి ఆంథోనీ ఫౌచీ నేతృత్వంలోని ఎన్ఐఏఐడీ నిధులు కేటాయించినట్లు ఈ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే నిజాలను తొక్కి పెట్టేందుకు ఫౌచీ కొందరు రాజకీయ నాయకులతో కలిసి ఇంటెలిజెన్స్ వర్గాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. అమెరికన్లను తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు.

Covid-19 Origin Expose Tulsi Gabbard Releases Docs on Fauci Funding Wuhan Lab Research Details

ఇదిలా ఉండగా.. ఆంథోనీ ఫౌచీ 2024లో అమెరికా కాంగ్రెస్ ముందు ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పారని తులసి గబ్బార్డ్ పేర్కొన్నారు. ఆ సమయంలో వైరస్ రీసెర్చ్ గురించి ఇంటెలిజెన్స్ అధికారులతో జరిపిన చర్చలపై ఆంథోనీ ఫౌచీని ప్రశ్నించగా.. తనకేమీ తెలీదంటూ ఆయన అబద్ధాలు ఆడారని ఈ పత్రాలు నిరూపిస్తున్నాయంటూ వెల్లడించారు. ఫార్మా కంపెనీల స్వార్థం కోసం, ట్రిలియన్ డాలర్ల విలువైన సార్వత్రిక వ్యాక్సిన్ల తయారీ కోసమే ఫౌచీ ఇలాంటి ప్రమాదకరమైన పరిశోధనలకు మద్దతు ఇచ్చారని.. కొవిడ్ వ్యాప్తి సహజంగా జరిగిందేనని నమ్మించడానికి స్వయంగా కొందరు సైంటిస్టులతో తప్పుడు నివేదికలు రాయించారని గబ్బార్డ్ కార్యాలయం విమర్శించింది.

ఈ కరోనా పరిశోధనల వ్యవహారంపై తులసి గబ్బార్డ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన బాధలను, నష్టాలను అనుభవించారని గుర్తుచేశారు. ఇన్నాళ్లుగా అబద్దాలు, సెన్సార్‌షిప్, నిజాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరిగాయని.. ఇకనైనా అమెరికా ప్రజలకు పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం లభించాల్సిన అవసరం ఉందని తులసి గబ్బార్డ్ స్పష్టం చేశారు. ఆంథోనీ ఫౌచీ లాంటి అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దేశాధ్యక్షుడికి కూడా కీలక సమాచారం అందకుండా అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. ఈ ఆరోపణలపై డాక్టర్ ఆంథోనీ ఫౌచీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+