ఐదు అసెంబ్లీ లకు ఉపఎన్నికలు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ ఉపఎన్నికలు గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
గుజరాత్ లోని కడి, విసవడార్.. కేరళ లోని నిలంబూర్.. పంజాబ్ లోని లూధియానా.. వెస్ట్ బెంగాల్ లోని కలిగంజ్ లో ఈ ఉపఎన్నిక జరగనుంది. ఈ స్థానాలు ఇటీవల ఎమ్మెల్యేల రాజీనామాలు, మరణాలు, అనర్హతలు వంటి కారణాల వల్ల ఖాళీ అయ్యాయి. దీంతో నియమిత వ్యవధిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఈ ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.

షెడ్యూల్ వివరాలు..
జూన్ 2: నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ
జూన్ 3: నామినేషన్ల పరిశీలన
జూన్ 5: నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు
జూన్ 19: ఐదు నియోజకవర్గాల్లో ఓటింగ్
జూన్ 25: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
ఈ ఉపఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం మొదటిసారిగా జరుగుతుండడం.. అలాగే తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు, బీహార్ శాసన మండలి ఎన్నికల ముందు జరగనున్న తరుణంలో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ ఎన్నిక స్వల్ప పోటీకి దారితీస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ, తృణముల్, ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశముంది.












Click it and Unblock the Notifications