దీపావళికి రైతులకు కేంద్రం కానుక.. ఖాతాల్లో 2వేలు, పండుగ చేస్కోండి!

దీపావళికి ముందు కేంద్రం శుభవార్త చెప్పబోతోంది. ముఖ్యంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగకు ముందు రైతుల ఖాతాలలో నిధులను జమ చేయనుంది. దేశవ్యాప్తంగా రైతులందరి ఇళ్లల్లో పండుగకు కానుక ఇవ్వబోతోంది.

పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్న కేంద్రం
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందిస్తున్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతలుగా 2000 రూపాయల చొప్పున, ఒక్కొక్కరి ఖాతాలో 6 వేల రూపాయలను జమ చేస్తుంది. ఇక ఇప్పుడు 21వ విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి నవంబర్ మధ్యకాలంలో ఈ ఏడాది మూడో విడత నిధులను విడుదల చేస్తుంది కేంద్రం.

Center gift to farmers for Diwali 2 thousand in their accounts celebrate with pm kisan samman nidhi

దీపావళికి ముందే నిధుల విడుదలకు ఛాన్స్
ఈ క్రమంలో ఈసారి దీపావళికి ముందు విడుదల చేస్తుందని అంచనా ఉంది. గతంలో కేంద్రం నిధులను విడుదల చేసిన తేదీలను గమనిస్తే 2024లో 18వ విడత అక్టోబర్ 5వ తేదీన, 2023లో నవంబర్ 15న, 2022 లో అక్టోబర్ 17న నిధులు జమ అయ్యాయి. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీన రాబోతుంది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

బీహార్ ఎన్నికల కోడ్ రాకముందే నిధుల విడుదల
బీహార్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందే నిధుల విడుదల జరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీకి ముందే 21వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పీఎం సమ్మాన్ నిధి యోజన కోసం రైతులు ఈ కేవైసీ పూర్తిచేసి ఆధార్ ను బ్యాంకు ఖాతాకు అనుసంధానించాలి.

పీఎం కిసాన్ పొందాలంటే ఇలా చెయ్యండి
భూమి వివరాలను వ్యవసాయ శాఖ ద్వారా ధ్రువీకరించు కోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయని రైతులు లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడతారు. కనుక కచ్చితంగా దీపావళికి ముందు పిఎం కిసాన్ ద్వారా లబ్ది పొందాలనుకుంటే రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+