తెలుగు రాష్ట్రాలపై సీబీఐ, ఈడీ పంజా-ఎన్నికల ముందు ఆ ముగ్గురి కట్డడికేనా ? మోడీ భారీ వ్యూహం ?

తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలు వైసీపీ, బీఆర్ఎస్ తో పాటు విపక్షంలో ఉన్న టీడీపీని కూడా పలు స్కాంలు, కేసుల పేరుతో ఈడీ, సీబీఐ టార్గెట్ చేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీబీఐ, ఈడీ పేర్లే వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఏపీలో ఢిల్లీ లిక్కర్ స్కాం, వైఎస్ వివేకా హత్య కేసు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఇలా ఎటు చూసినా స్కాంలు, కేసుల చుట్టూ దర్యాప్తు సంస్ధలు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయా కేసుల్లో ఇప్పటివరకూ బీఆర్ఎస్, వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్న ఈడీ, సీబీఐ.. ఇప్పుడు టీడీపీ వెంట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్ని తమ గ్రిప్ లో పెట్టుకునేందుకు కేంద్రం పన్నుతున్న వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.

 తెలుగు రాష్ట్రాలపై కేంద్రం పంజా ?

తెలుగు రాష్ట్రాలపై కేంద్రం పంజా ?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్ధలు హల్ చల్ చేస్తున్నాయి. గత నాలుగేళ్లుగా పలు కేసుల్లో మౌనంగా ఉండిపోయిన ఇవే దర్యాప్తు సంస్ధలు ఇప్పుడు ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలున్న తరుణంలో పంజా విసురుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్న బీఆర్ఎస్ తో పాటు తమకు మద్దతుగానే ఉన్న వైసీపీ, టీడీపీని సైతం కేంద్రం వదిలిపెట్టడం లేదు. దీంతో ఎన్నికల నాటికి పరిస్ధితులు తారుమారు అవుతాయనే ఉద్దేశంతో కేంద్రం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది.

 ఢిల్లీ లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ పై..

ఢిల్లీ లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ పై..

ఢిల్లీలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు చేర్చిన ఈడీ.. ఇప్పుడు ఆమెను వరుసగా విచారణలకు పిలిపిస్తూ ఏ క్షణాన్నైనా అరెస్టు చేస్తామన్న సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే కవితకు దగ్గరి వ్యక్తుల్ని అరెస్టు చేసిన ఈడీ.. పీఎంఎల్ఏ చట్టం కింద వీరిని విచారిస్తోంది. దీంతో సాధారణంగా ఐపీసీ, సీఆర్పీసీ వంటి శిక్ష్మాస్మృతులకు వర్తించే మినహాయింపులు కూడా ఇందులో వారికి దొరకడం లేదు. కవితపై ఈడీ జరుపుతున్న విచారణతో తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు ఎన్నికలకు ముందు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక కవిత అరెస్టయితే ఎన్నికలకు ముందు కేసీఆర్ కు మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చు.

 లిక్కర్ స్కాం, వివేకా హత్యతో వైసీపీపై

లిక్కర్ స్కాం, వివేకా హత్యతో వైసీపీపై

అలాగే ఏపీలో అధికార పార్టీ వైసీపీని సైతం ఇప్పుడు లిక్కర్ స్కాంతో పాటు వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు సంస్ధలు టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు కోడికత్తి కేసులోనూ వాస్తవాలు తేల్చేందుకు ఎన్ఐఏ ముందుకు కదులుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఇవాళ విచారణకు రావాలని ఈడీ సమన్లు పంపింది. ఇప్పటికే ఆయన కుమారుడు రాఘువను అరెస్టు చేసింది కూడా. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పాత్రను నిరూపించేందుకు సీబీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వీరిద్దరినీ విచారణకు పిలుస్తోంది. అవినాష్ తన అరెస్టు తప్పదని తెలిసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. అలాగే లిక్కర్ స్కాంలో మాగుంటను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటిలో ఏది జరిగినా వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

 స్కిల్ స్కాంతో టీడీపీకీ ఉచ్చు ?

స్కిల్ స్కాంతో టీడీపీకీ ఉచ్చు ?

మరోవైపు ఏపీలో తమకు మద్దతుగా ఉంటున్న విపక్ష పార్టీ టీడీపీని సైతం కేంద్రం వదలడం లేదు. చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఇప్పటికే వైసీపీ సర్కార్ సీఐడీ దర్యాప్తు చేయిస్తుండగా మరోవైపు కేంద్రం ఈడీ, ఐటీల్ని ఉసిగొల్పుతోంది. ఈ స్కాంలో టీడీపీ, చంద్రబాబు పాత్ర్ నిర్ధారణ అయితే ఆ పార్టీకి సైతం ఎన్నికలకు ముందు ఇబ్బందులు తప్పేలా లేవు. రూ.371 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్న ఈ స్కాంలో చంద్రబాబు పాత్రపై అసెంబ్లీలో నిన్న జగన్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో కేంద్రం నుంచి ఎదురవుతున్న ఒత్తిడి చూస్తుంటే ఎన్నికలకు ముందు టీడీపీకి షాకులు తప్పడం లేదు.

 మోడీ వ్యూహమిదేనా ?

మోడీ వ్యూహమిదేనా ?

తెలుగు రాష్ట్రాల్లో అధికార బీఆర్ఎస్, వైసీపీతో పాటు విపక్ష టీడీపీని కూడా కేంద్ర దర్యాప్తు సంస్ధలు టార్గెట్ చేస్తున్న తీరు చూస్తుంటే ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ భారీ వ్యూహమే రచించినట్లు అర్ధమవుతోంది. ఎన్నికల నాటికి మారే పరిస్దితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ఆయా పార్టీల్ని తమవైపు పూర్తిగా తిప్పుకునేందుకు, గ్రిప్ లో ఉంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ ప్రధాన నేతలెవరినీ అరెస్టు చేయకపోవడం ఒక్కటే వారికి ఊరటగా కనిపిస్తోంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్ధల దూకుడుతో ఎన్నికల నాటికి బీజేపీకి అనుకూలంగా పరిస్ధితులు పూర్తిగా మారే అవకాశాలూ లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+