ఉద్యోగులకు గుడ్‌న్యూస్: పండుగకు ముందు పెరిగిన జీతం!

దసరా, దీపావళి పండుగలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ 3శాతం పెంపునకు ఆమోదం తెలిపింది. అదే విధంగా పెన్షనర్ల కోసం 3 శాతం డియర్నెస్ రిలీఫ్ కూడా పెంచబడింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెంపును ఆమోదించారు ఈ పెంపుతో ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరిగింది. ఈ పెంపు జులై 1, 2025 నుంచే అమలులోకి వస్తుంది.

కేంద్ర ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన బకాయి (Arrears) సొమ్మును దీపావళికి సరిగ్గా ముందు అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు.దీని అర్థం ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. ఈ పెరిగిన జీతాలు, బకాయిలతో ఉద్యోగులు, పెన్షనర్లు పండుగ సందర్భంగా ఉత్సాహంగా ఖర్చు చేయగలుగుతారు. పెరిగిన ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Central Employees Get Festive Cheer Cabinet Approves 3 DA Hike to 58

ఎవరికి వర్తిస్తుంది?
ఈ పెంపు ఏడవ వేతన సంఘం పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ డీఏ పెంపు ఈ సంవత్సరంలో రెండో అతిపెద్ద పెంపు. ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు (జనవరి, జూలైలో) డీఏను సవరిస్తుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది.

ఈ డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానా వేల కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడనుంది. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల చేతుల్లోకి పండుగ సీజన్ కు ముందు అదనపు నిధులు చేరనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+